Earn Money Online: సాధారణంగా ఏ ఉద్యోగమైనా రోజుకు 8 నుంచి 9 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. ఒక్కొసారి పని ఎక్కువ ఉండడం వల్ల అధిక సమయం దానిపై వెచ్చించాల్సి రావొచ్చు. ఇంతపని చేసినా.. నెలాఖరుకు వేలల్లో లేదా లక్షల రూపాయల జీతం వస్తుంది. కానీ, ఓ యూట్యూబర్ ఒక్క రాత్రిలో లక్షల రూపాయలు ఆర్జించాడు. ఒక్కరోజులో లక్షాధికారి అవ్వడం ఎలా సాధ్యమని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ మీరూ చదివేయండి.
ఏం జరిగిందంటే?
ఓ 21 ఏళ్ల యువకుడు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా లక్షల రూపాయాలను సంపాదిస్తున్నాడు. అది కూడా వారానికి 6 గంటల్లోనే అంత డబ్బు సంపాదిస్తుండడం విశేషం. ఆ యూట్యూబర్ నిద్రపోయే సమయంలో తన పక్కన మైక్రోఫోన్, కెమెరా, లైటింగ్, మానిటర్ పెట్టి పడుకుంటాడు. తాను నిద్రించడాన్ని వేలాది మంది చూడాలని వీడియోను యూట్యూబ్ లో లైవ్ పెట్టాడు. ఈ వీడియోను వేలాది మంది చూడడమే కాకుండా.. డబ్బును కూడా విరాళంగా ఇస్తున్నారు. అయితే తాను నిద్రిస్తున్న క్రమంలో లైవ్ ఇవ్వడం సహా ఆ వీడియోను బ్లాగ్ లో పోస్ట్ చేస్తున్నాడు.
21 ఏళ్ల యువకుడు నిద్రించే వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అయితే నిద్రిస్తున్న వ్యక్తిని లేపేందుకు తనతో పాటు అలెక్సా ద్వారా పాటలు ప్లే చేయడం లేదా సందేశాలు పంపడం వంటి వాటి వల్ల అతడ్ని నిద్ర లేపేందుకు చాలా మంది ప్రయత్నించారు. అలా వారంలో ఆరు గంటలు పాటు లైవ్ వీడియో చేయడం వల్ల ఆ యువకుడు దాదాపుగా రూ.2 లక్షలకు పైగా సంపాదించినట్లు తెలుస్తోంది.
నిద్రపోతున్న వీడియోలకు మంచి గిరాకీ..
యూట్యూబ్ లో స్లీప్ స్ట్రీమ్ బాగా ప్రాచుర్యం పొందింది. ఈ క్రమంలో అనేక మంది నెటిజన్లు తాము నిద్రిస్తున్న వీడియో యూట్యూబ్ లో లైవ్ పెట్టి లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. నిద్రపోతూ కూడా సంపాదించే అవకాశాన్ని వదులుకోవడం ఎందుకని చాలా మంది దీన్ని అనుసరిస్తున్నారు. అయితే ఈ వీడియోలను చాలా మంది ఆసక్తి తిలకిస్తుండడం గమనార్హం. ఇలాంటి వీడియోలు ఇప్పటి వరకు యూట్యూబ్ లో 170కి పైగా పోస్ట్ అవ్వడం విశేషం.
Also Read; Dog vs Frog Video: కప్ప ధాటికి తోక ముడిచిన శునకం- వైరల్ వీడియో
Also Read: Sachin Tendulkar: గాయపడిన పక్షిని కాపాడిన సచిన్, వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook