Funny Love Proposal Video: ప్రేమికులు ఏం చేసినా కొత్తగానే ఉంటుంది. ముఖ్యంగా అబ్బాయిలు అమ్మాయిలను సర్ప్రైజ్ చేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అమ్మాయిల పరిస్థితి కూడా అంతే. ప్రేమికులు ప్రపోజల్స్ విషయంలోనూ గిఫ్ట్ లు ఇచ్చే క్రమంలోనూ సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖ్యంగా మ్యారేజ్ ప్రపోజల్స్ క్రమంలో అబ్బాయి అమ్మాయికి రింగుతడుగుతూ ప్రపోజ్ చెయ్యడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు ఇలాంటి వీడియోలే సోషల్ మీడియాలో తెగ వాయిదాలుగా మారుతున్నాయి. ఇద్దరు కపుల్స్ మ్యారేజ్ ప్రపోసల్స్ వీడియో ప్రపంచమంతా చక్కర్లు కొడుతుంది. ఆ వీడియో ఏంటో? వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


ఓ అబ్బాయి తన స్నేహితురాలికి మ్యారేజ్ ప్రపోజల్ చేస్తున్న వీడియో ప్రస్తుతం తెగ వైరల్ గా మారుతుంది. మీరు ఈ వీడియోని గమనిస్తే.. తన అమితమైన ప్రేమను చూపించడానికి యువకుడు సముద్రం మధ్యలోకి తన స్నేహితురాలని తీసుకెళ్తాడు.


ఇదే క్రమంలో ఆ యువకుడు తన జేబులో ఉన్న డైమండ్ రింగ్ తీసి ఆ అమ్మాయికి ప్రపోజ్ చేసే క్రమంలో అనుకోని సంఘటన జరుగుతుంది. ఆ అబ్బాయి రింగును తన జేబులో నుంచి బయటకు తీయబోతుండగా ఆ రింగ్ సముద్రంలో పడిపోతుంది. ఇలా పడిపోయిన రింగును వెతకడానికి ఆ యువకుడు కూడా సముద్రంలోకి దూకుతాడు. ఇలా ఇదంతా చూసిన తన స్నేహితురాలు ఏం చేయాలో అర్థం కాక.. ఏం జరుగుతుందో తెలియక తెగ ఆశ్చర్యానికి గురవుతుంది.


Also Read: CSK Vs GT Rain Updates: ఫైనల్‌ మ్యాచ్‌కు వరుణుడి దెబ్బ.. పూర్తి సమీకరణలు ఇలా..




ఈ వీడియోని చూసినట్లయితే ఆశ్చర్యానికి గురవుతున్నారు. మరికొందరైతే వారి అభిప్రాయాలను ఇలా తెలుపుతున్నారు.. "మ్యారేజ్ ప్రపోసల్స్ చేసే క్రమంలో ఇలాంటి సాహసాలు చేయకూడదని" అంటున్నారు. మరికొందరైతే ఈ వీడియోను చూసి తెగ నవ్వుకున్నామంటూ కామెంట్ చేస్తున్నారు.


ఇప్పుడు ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారుతుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోను @cctvidiots అనే ఖాతా ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ చేశారు. ఈ వీడియోను 70 లక్షల మందికి పైగా వీక్షించగా.. చాలామంది షేర్ చేశారు.


Also Read: CSK Vs GT Rain Updates: ఫైనల్‌ మ్యాచ్‌కు వరుణుడి దెబ్బ.. పూర్తి సమీకరణలు ఇలా..



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook