Lovers Funny Viral Video, Boy touches Girl feet on Mid Road for Love: ప్రేమ.. ఈ రెండు అక్షరాల పదానికి అర్థాన్ని వివరించడం అసాధ్యమనే చెప్పాలి. ప్రేమను అనుభూతించాల్సిందే తప్ప.. పదాల్లోకి తర్జుమా చేయలేం. యువతీయువకులు తమ ప్రేమను వ్యక్త పరిచేందుకు ఎన్నో దారులు వెతుకుంటారు. కొందరు లవ్ లెటర్స్ ఇచ్చి ప్రేమను వ్యక్తం చేస్తుంటారు. మరికొందరు నేరుగా వెళ్లి తన మనసులో మాటను చెప్పేస్తుంటారు. ఒక్కోసారి తమ ప్రేమను ఎన్నిసార్లు చెప్పినా.. పట్టించుకోకుంటే కాళ్ల మీద కూడా పడుతుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం... ముగ్గురు కాలేజ్ అమ్మాయిలు రోడ్డు వెంబడి నడుచుకుంటూ వెళుతుంటారు. వారిని ఫాలో అవుతూ ఇద్దరు అబ్బాయిలు వెనకాలే వెళుతుంటారు. యెల్లో చుడీదార్ వేసుకున్న అమ్మాయికి ఓ అబ్బాయి లవ్ లెటర్ ఇస్తాడు. అమ్మాయి లెటర్ పట్టుకుని వెళుతుండగా.. తన ప్రేమని అంగీకరించాలని అబ్బాయి కోరతాడు. అయినా ఆ అమ్మాయి మిగతా ఇద్దరితో కలసి నడుచుకుంటూ వెళుతుంది. 



ఇక తన ప్రేమను ఎలాగైనా దక్కించుకోవాలనాకున్న అబ్బాయి హఠాత్తుగా ఆ అమ్మాయి కాళ్లు పట్టుకుంటాడు. వెంటనే ఆ అమ్మాయి తనను వదలాలంటూ నవ్వేస్తుంది. అయినా అతడు ఆమె కాళ్లు వదలలేదు. మరో అబ్బాయి కూడా మరో అమ్మాయి కాళ్లు పట్టుకుని రోడ్డుపై పడుకుని ఉంటాడు. ఇందుకు సంబందించిన వీడియోని 'bihari.broo' అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 2 లక్షల మంది వీక్షించారు. చాలా మంది లైక్ చేసి కామెంట్స్ చేస్తున్నారు. అబ్బాయిలు చేసిన పనిపై చాలామంది ఎగతాళి చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఘటన నిజంగా జరిగిందా లేక ఫ్రాంక్ అనేది తెలియాల్సి ఉంది. 


Also Read: Mehidy Hasan No Balls: అరుదైన నోబాల్స్ వేసిన బంగ్లాదేశ్ బౌలర్.. టీమిండియాకు వరుసగా రెండు ఫ్రీహిట్స్!  


Also Read: Rohit Sharma Record: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. శ్రేయాస్, మెహదీ రేర్ రికార్డ్స్ ఇవే!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.