Rohit Sharma became first Indian batter to hits 500 sixes in international cricket: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో గాయపడిన విషయం తెలిసిందే. బొటన వేలికి కుట్లు పడడంతో తప్పనిసరి పరిస్థితులలో బ్యాటింగ్‌కు దిగాడు. రోహిత్ తన కెరీర్‌లో తొలిసారి 9వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. వెలికి గాయం అయినా జట్టును గెలిపించడానికి విశ్వప్రయత్నం చేశాడు. 5 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ (51 నాటౌట్) బాదాడు. అయితే వీరోచిత ఇన్నింగ్స్ ఆడినా.. భారత జట్టును గెలిపించలేకపోయాడు. చివరి బంతికి 6 రన్స్ చేయాల్సి ఉండగా.. భారీ షాట్ ఆడడంలో రోహిత్ విఫలమయ్యాడు.
రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేసే క్రమంలో అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 500పైగా సిక్సర్లు బాదిన రెండో ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. ఈ జాబితాలో యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ మాత్రమే ముందు ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో గేల్ 553 సిక్సులు బాదాడు. అంతేకాదు అంతర్జాతీయ క్రికెట్‌లో 500పైగా సిక్సర్లు బాదిన తొలి భారత ప్లేయర్‌గా మరో రికార్డు నెలకొల్పాడు. రోహిత్ తన కెరీర్‌లో మొత్తం 502 అంతర్జాతీయ సిక్సర్లు బాదాడు. రోహిత్ దరిదాపుల్లో కూడా ఏ భారత బ్యాటర్ లేదు. ఎంఎస్ ధోనీ 359 సిక్సులు బాదాడు.
వన్డే ఫార్మాట్‌లో భారత్ తరఫున 2022లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా యువ ఆటుగాడు శ్రేయాస్ అయ్యర్ ఓ రికార్డు నెలకొల్పాడు. 2022 ఆరంభం నుంచి నిలకడగా రాణిస్తున్న అయ్యర్.. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో 82 పరుగులు చేశాడు. దాంతో ఈ ఏడాది భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ (685)ను అయ్యర్ అధిగమించాడు. అయ్యర్ ఈ ఏడాదిలో 14 ఇన్నింగ్స్‌లలో 60.08 సగటుతో 721 పరుగులు చేశాడు.
తొలి వన్డేలో చివరి వరకు పోరాడి బంగ్లాదేశ్‌ను గెలిపించిన మెహదీ హసన్.. రెండో వన్డేలో సెంచరీ బాదాడు. 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన మెహదీ 83 బంతుల్లో శతకం చేశాడు. దాంతో 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీ సాధించిన తొలి ఆసియా క్రికెటర్‌గా మెహదీ ఓ రికార్డు నెలకొల్పాడు. మొత్తంగా చూసుకున్నా ఈ రికార్డు సాధించిన రెండో బ్యాటర్ మెహదీ మాత్రమే. ఐర్లాండ్ ప్లేయర్ సిమి సింగ్ దక్షిణాఫ్రికాపై 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీ బాదాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.