Viral News: ఇదేం ప్రచారం రా నాయన.. పెళ్లి కోసం ఇలా కూడా చేస్తారా.. ?.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఘటన..
Madhya Pradesh: యువకుడి తల్లిదండ్రులు పూజల్లో బిజీగా ఉంటారు. నాకు అమ్మాయిని చూసే తీరక కూడా వాళ్లకు లేదని కొత్త మార్గంలో ప్రచారం ప్రారంభించాడు. తనకు క్యాస్ట్ ఫీలింగ్ లేదని చెప్పుకొచ్చాడు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Need A Wife With Hoardings On E Rickshaw In Madhya Pradesh: సమాజంలో అమ్మాయిలకు చాలా ఫుడ్ డిమాండ్ ఉందని చెప్పుకొవచ్చు. ఒకప్పటి లాగా అమ్మాయిలు ఇంట్లో మాత్రమే పరిమితం కావడం లేదు. చదువుకుని ఉన్నత రంగాలలో కూడా రాణిస్తున్నారు. అబ్బాయికల కంటే ఒక అడుగు ముందు ఉంటున్నారు. చేసే పనివిషయంలో, శాలరీల విషయంలో కూడా అమ్మాయిలే ముందుంటున్నారు. దీంతో ఇప్పుడు అబ్బాయిలకు పెద్ద చిక్కు వచ్చి పడింది. పెళ్లి చేసుకొవడానికి సరైన సంబంధాలు దొరక్క.. అబ్బాయిలు పడుతున్న కష్టాలు మాటల్లో చెప్పలేము.
Read More: Shriya Saran: తెల్ల చీరలో శ్రియ శరన్ ఘాటు ఫోజులు.. ఇది మాములు డోసు కాదండోయ్..
అమ్మాయిలు కూడా.. తమ కన్న ఎక్కువగా చదువుండి, ప్యాకేజీలు, ప్రాపర్టీలు ఉన్న వారికే పెళ్లికి ఓకే చెబుతున్నారు. దీంతో చాలా మంది యువకులు ... పెళ్లిళ్లు కాక.. మిగిలిపోతున్నారు. ఇక యువకుల తల్లిదండ్రులు కూడా.. తమ పిల్లలకు సరైన మ్యాచ్ కోసం బంధువులను, మ్యాట్రిమోనీ వాళ్ల వెంటతిరిగి డబ్బులు కట్టి, అలసిపోయి, ఏమి చేయలేక చేతులెత్తేస్తున్నారు. దీంతో కొందరు యువకులు తమకు కావాల్సిన సరైన మ్యాచ్ కోసం తామే ఏదో ఒక రకంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అచ్చం ఇలాంటి ఒక వింత ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
పూర్తివివరాలు..
మధ్యప్రదేశ్ లోని దామోహ్ లో దీపేంద్ర రాథోడ్ అనే యువకుడు ఆటో నడిపిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడి తల్లిదండ్రులు పూజలు పురోహితం చేస్తుంటారు. దీపేంద్ర రాథోడ్ వయసు దాటిపోతుంది. తల్లిదండ్రులు సరైన సంబంధం చూడట్లేదని విసిగిపోయాడు. ఇలా కాదని తన రంగంలోకి దిగాడు. 29 ఏళ్ల దీపేంద్ర రాథోడ్.. వధువును వెతకడానికి ఒక ప్రత్యేకమైన విధానాన్ని తీసుకున్నాడు.
అతను తన ఇ-రిక్షాపై ఒక హోర్డింగ్‌ను పెట్టుకున్నాడు. తనకు పెళ్లికోసం యువతి కావాలని, వ్యక్తిగత వివరాలను కూడా హోర్టింగ్ లో రాసుకొచ్చాడు. దీపేంద్ర ప్రకారం, తనకు మతం, కుల భేదాలు పట్టింపు లేదని, వివాహ ప్రతిపాదనతో ఏ స్త్రీ అయినా తనను సంప్రదించవచ్చని చెప్పాడు.
రాథోడ్ కూడా సరైన వధువు కోసం కొన్ని పెళ్లి గ్రూపులలో చేరాడు. కానీ అతనికి ఇప్పటిదాక ఒక మహిళ దొరకలేదు. ఇలా లాభం లేదని, తన రిక్షాపైన పూర్తి వివరాలతో హోర్డింగ్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఇతరులు కూడా పెళ్లి చేసుకొవాలని ఇంట్రెస్ట్ ఉన్న వారు తనను సంప్రదించవచ్చని దీపేంద్ర అన్నారు.
Read More: Haircare Tips: ఒత్తైన మందపాటి జుట్టు కావాలా? షహనాజ్ హుస్సేన్ బ్యూటీ టిప్స్ ఫాలో అవ్వండి..
ఈ హోర్డింగ్‌లో 29 ఏళ్ల యువకుడి ఎత్తు, పుట్టిన తేదీ, సమయం, బ్లడ్ గ్రూప్, విద్యార్హతలు, 'గోత్రం' మొదలైన వాటితో సహా వివరాలను ప్రదర్శించాడు. కాగా, రాథోడ్ తన సొంత ఇ-రిక్షా నడపడం ద్వారా తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తన బెటర్ హాఫ్‌ను ఎల్లప్పుడూ సంతోషంగా, ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటానని కూడా చెప్పాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook