Viral Video, Man Beard Catches Fire during dangerous stunt with petrol: ఫైర్ స్టంట్‌లు చూడటానికి, చేయడానికి ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంటాయి. స్టంట్‌ చేసేవారు ఎంత బాగా చేస్తే.. జనాలు అంత త్రిల్ ఫీల్ అవుతారు. ఫైర్ స్టంట్‌లు ఎంత థ్రిల్లింగ్‌గా ఉంటాయో.. అదే సమయంలో చాలా చాలా ప్రమాదకరంగా కూడా ఉంటాయి. ఫైర్ స్టంట్‌ సరైన పద్ధతిలో చేయకుంటే.. భారీ మూల్యం చెల్లిచుకోవాల్సి ఉంటుంది. స్టంట్‌ బెడిసికొడితే.. ప్రమాదకమైర ఘటనలు చోటుచేసుకుంటాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. స్టంట్ చేస్తున్న ఓ యువకుడు ఫైర్ ప్రమాదానికి గురయ్యాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'రవి పాటిదార్' అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో కొద్ది రోజుల కిందట ఓ వీడియో షేర్ అయింది. వీడియో ప్రకారం.. షోలో భాగంగా ఓ వ్యక్తి బల్లపై నిలబడి ఉంటాడు. అతడి చుట్టూ జనాలు గుమికూడి ఉంటాయి. అతడి చేతిలో ఓ స్టిక్ ఉంటుంది. ఆ స్టిక్‌కు మంట కూడా ఉంటుంది. ఆ వ్యక్తి తన నోట్లో పెట్రోల్ పోసుకుని.. స్టిక్‌పై వేగంగా ఊదుతాడు. దాంతో భారీగా మంటలు చెలరేగుతాయి. స్టిక్‌ నుంచి మంటలు ఆ వ్యక్తి ముఖానికి అంటుకుంటాయి. అతడి గడ్డంపై మంటలు చెలరేగుతాయి. 



స్టంట్‌ చేస్తున్న వ్యక్తి గడ్డంకు మంటలు అంటుకోవడంతో పక్కన ఉన్న వ్యక్తులు అప్రమత్తం అవుతారు. బల్లపైకి ఎక్కి అతడి ముఖాన్ని చేతులతో కొడుతూ మంటలు ఆర్పుతారు. మంటలు ముఖానికి భారీగా చెలరేగడంతో.. నొప్పికి యువకుడు విలవిలలాడాడు. అనంతరం అతడికి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళతారు. 'ravipatidar603' అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోకి ఇప్పటివరకు 12.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 'ప్రాణాలను ఫణంగా పెట్టి ఇలాంటి స్టంట్స్ చేయడం అవసరమా', 'నిప్పుతో పెట్టుకుంటే అంతే' అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 


Also Read: Poonam Bajwa Pics: కన్ను గీటుతూ.. కుర్రాళ్లను టెంప్ట్ చేస్తున్న బొద్దుగుమ్మ పూనమ్ బజ్వా!  


Also Read: కేర్ టేకర్‌ను పక్కకు తోసేసి.. స్మార్ట్‌ఫోన్ చూస్తున్న ఏనుగు! నవ్వులు పూయిస్తున్న వీడియో


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook