Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ హింస.. మంత్రులు, ఎమ్మెల్యే ఇళ్లపై దాడి, ఇంటర్నెట్ బంద్ వీడియో వైరల్..
Manipur Violence Video Viral: మణిపూర్‌లో మళ్లీ హింసకు తెర తీసింది. ఆరుగురుని అత్యంత పాశవికంగా చంపడంతో మరోసారి ఆగ్రహజ్వాలలతో హింసకు ఆజ్యం పోసింది. ఏకంగా ఎమ్మెల్యేల ఇంటిని ముట్టడించడంతో కర్ఫ్యూ విధించారు. భద్రత బలగాలు వారిని అదుపు చేసేందుకు వారిపై భాష్పవాయువును ప్రయోగించారు. సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Manipur Violence Video Viral: మణిపూర్‌లో మరోసారి హింసాఖాండ మొదలైంది. మైతీలకు చెందిన ఆరుగురిని ఇటీవలె కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. వారి మృతదేహాలు నది వద్ద శనివారం కనిపించడంతో మళ్లీ మణిపూర్ అట్టుడికింది. కుకీ మిలిటెంట్లు ఈ దారుణానికి వడగట్టడంతో న్యాయం కోసం ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద పెద్ద ఎత్తున్న నిరసనలు చేపట్టారు మైతీలు. దీంతో వారిలో కొందరు ఆందోళనకారులు ఇళ్లను ముట్టడించారు. ఒక్కసారిగా అలెర్ట్ అయిన పోలీసులు వారిని కట్టడి చేశారు. ఆ ప్రాంతంలో పూర్తిగా ఇంటర్నెట్ సేవల్ బంద్ చేశారు. కర్ఫ్యూ విధించారు.
వారు కిడ్నాప్ చేసి చంపిన వారిలో ముగ్గురు ఆడవాళ్లు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ దారుణ ఘటనలో పది నెలల చిన్నారి కూడా ఉంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆందోళనకారులు మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడికి దిగారు. అక్కడి ఫర్నిచర్‌ను కూడా వారు ధ్వంసం చేశారు. దీంతో వారిని అదుపు చేయడానికి పోలీసులు, భద్రతా సిబ్బంది వారిపై భాష్పవాయువు ప్రయోగించారు.పశ్చిమ ఇంఫాల్, బిష్ణాపూర్, తౌబల్, కక్చింగ్, కాంగ్‌పోక్కి, చురాచంద్‌పూర జిల్లాలలో రెండు రోజులు పాటు ఇంటర్నెట్ సేవలను ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగా నిలిపివేశారు.
ఇదీ చదవండి: జియో, బీఎస్‌ఎన్‌ఎల్ 70 రోజుల వ్యాలిడిటీతో ఏ ప్లాన్ బెట్టరో తెలుసా? ప్లాన్ ధరలు చెక్ చేయండి..
గత సోమవారం జిరిబమ్ జిల్లాలో భద్రతా దళాలు, మిలిటెంట్ల మధ్య జరిగిన కాల్పుల పరిణామం తర్వాత రిలీఫ్ క్యాంపులో ఉన్న ఈ ఆరుగురిని మిలిటెంట్లు కిడ్నాప్ చేశారని మైతేయి తెగవారు ఆరోపించారు.ఇదిలా ఉండగా నవంబర్ 11వ తేదీ కూడా మిలిటెంట్ల గ్రూపు బోరోబేక్రా పోలీస్ స్టేషన్‌పై దాడి చేసింది. భద్రత బలగాల ఎదురు కాల్పుల్లో 11 మంది మిలిటెంట్లు మృతి చెందారు. ఆ సమయంలోనే పోలీసు రిలీఫ్ క్యాంపులో ఉన్న ముగ్గురు ఆడవాళ్లు, మరో ముగ్గురు చిన్నారులను మొత్తం ఆరుగురిని మిలిటెంట్లు కిడ్నాప్ చేశారు.
ఈ నేపథ్యంలో వారికి భద్రత బలగాల తీవ్రంగా సెర్చ్ ఆపరేషన్ కూడా నిర్వహించాయి. ఈలోగా వారిని మిలిటెంట్లు అత్యంత దారుణంగా హత్యచేశారు. ఇక ప్రభుత్వం మణిపూర్‌లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇచ్చాయి.గత ఏడాదిన్నరగా మైతీ, కూకీల మధ్య హింస మరింత పెరిగింది. ఇలా అట్టుడికిపోతున్న మణిపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో సాయుధ దళాల చట్టాన్ని విధిస్తూ గురువారం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జిరిబమ్, కాగ్మోక్‌ఫీ, సెక్మయ్ వంటి జిల్లాలో ఈ స్పెషల్ యాక్ట్‌ను విధించింది.
ఇదీ చదవండి: రైతులకు రేవంత్ సర్కార్ బంపర్ గుడ్‌న్యూస్.. అకౌంట్లలో బోనస్ డబ్బులు జమా, వెంటనే చెక్ చేసుకోండి..!
అయితే, ఆందోళనకారులు నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తోన్న వాహనాలపై కూడా దాడికి దిగబడ్డారు. వాటికి నిప్పు పెట్టారు. జాతీయ రహదారి గుండా వెళ్తున్న లారీలను అడ్డుకున్నారు. ఈ రెండు తెగలు మాత్రమే కాదు. మణిపూర్‌లో నాగ తెగ కూడా ఉంది. ఈ దాడిపై ఆ తెగ స్పందించింది. కూకీ తెగవారు ఆరుగురిని అత్యంత పాశవికంగా హత్య చేసిందని ఆరోపిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి