Men Protested For Brides: నా వధువు ఏమైందంటూ కలెక్టరేట్ ఎదుట 50 మంది ధర్నా
Men Protested For Brides: అచ్చం పెళ్లికొడుకు మండపానికి వచ్చినట్టుగా డోలుబాజాల మధ్య గుర్రంపై ఊరేగుతూ కలెక్టరేట్ ఎదుటకు చేరుకున్నారు. నా వధువు ఏమైందంటూ కలెక్టర్‌ని నిలదీస్తూ ధర్నాకు దిగారు. ఈ వింత నిరసన చూసి బిత్తరపోవడం జిల్లా అధికార యంత్రాంగం వంతయ్యింది.
Men Protested For Brides: నా వధువు ఏమైందంటూ కలెక్టరేట్ ఎదుట 50 మంది ధర్నా అనే టైటిల్ చూసి అవాక్కవుతున్నారా ? అసలేం జరుగుతుందో అర్థం కావడం లేదని ఆశ్చర్యపోతున్నారా ? మీకే కాదు.. ఈ నిరసన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూసిన వాళ్లు కూడా ఏం జరుగుతుందో అర్థం కాక జుట్టుపీక్కున్నారు. బ్రహ్మచారులైన 50 మంది యువకులు వరుడి గెటప్స్ వేసుకుని, అచ్చం పెళ్లికొడుకు మండపానికి వచ్చినట్టుగా డోలుబాజాల మధ్య గుర్రంపై ఊరేగుతూ కలెక్టరేట్ ఎదుటకు చేరుకున్నారు. నా వధువు ఏమైందంటూ కలెక్టర్‌ని నిలదీస్తూ ధర్నాకు దిగారు. ఈ వింత నిరసన చూసి బిత్తరపోవడం జిల్లా అధికార యంత్రాంగం వంతయ్యింది.
ఇంతకీ ఈ వింత నిరసన ఎక్కడ జరిగింది ? ఎందుకు జరిగింది ? వింత నిరసన డిమాండ్ ఏంటి అనే విషయాలను అర్థం చేసుకోవాలంటే ఈ ధర్నా గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సిందే. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది.
పెళ్లీడు దాటిపోతున్నా తమకు వధువు లభించడం లేదని.. ఎన్నాళ్లిలా పెళ్లి కాకుండా ఉండాలనే ఉద్దేశంతో బ్రహ్మచారులు ధర్నాకు దిగారు. ఇంతకీ వారి డిమాండ్ ఏంటంటే.. సమాజంలో స్త్రీ, పురుష నిష్పత్తి ఉండాల్సిన విధంగా లేకపోవడం వల్లే ఇలాంటి సమస్య తలెత్తుతోందని.. స్త్రీ, పురుష నిష్పత్తిలో వృద్ధి కనిపించేలా ప్రీ-కాన్సెప్షన్ అండ్ ప్రి-నేటల్ డయాగ్నస్టిక్ టెక్నిక్స్ యాక్టుని కఠినంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్‌దే అని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. అందులో భాగంగానే నా వధువు ఏమైందనే నినాదంతో ధర్నాకు దిగారు. అనంతరం షోలాపూర్ కలెక్టర్‌కి ఒక మెమొరాండం ఇచ్చి అక్కడి నుంచి మళ్లీ ఊరేగింపుగా వెనుదిరిగారు.
నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2019-21 ప్రకారం మహారాష్ట్రలో స్త్రీ, పురుషుల మధ్య సెక్స్ రేషియోని పరిశీలిస్తే.. ప్రతీ 1000 మంది పురుషులకు 920 మంది స్త్రీలు మాత్రమే ఉన్నారు. బాలికల పట్ల చిన్న చూపు, బ్రూణహత్యలు, బాలికలపై పెరుగుతున్న నేరాలు వంటి అంశాలు ఈ జెండర్ రేషియోలో వ్యత్యాసాలకు కారణం అవుతున్నాయనే విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి : Viral Video: బుడ్డోడి చాకచక్యం.. తల్లిని కాపాడిన వీడియో వైరల్.. చూస్తే ఔరా అనాల్సిందే..
ఇది కూడా చదవండి : 1000 Notes Coming Back: 1000 రూపాయల నోట్లు మళ్లీ వస్తున్నాయా ? 2 వేల నోట్లు బ్యాన్ ? ఏది నిజం ?
ఇది కూడా చదవండి : Cockroach Found in Omelette: రైల్లో ఆహారం తింటున్నారా ? ఆమ్లెట్‌లో బొద్దింకపై ప్రధానికి ఫిర్యాదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook