Wonder World: ప్రపంచంలో నిత్యం ఎన్నో వింతలు జరుగుతుంటాయి. అందులో మరికొన్ని ఘటనలు మరింత వింతగా ఉంటాయి. ఇప్పుడు మీరు చదవబోయేది కూడా అలాంటి ఒక ఘటన గురించే. మెక్సికోకు చెందిన ఒక యువకుడు తన లవర్ ఇంటికి చేరడాని కొత్తగా ఆలోచించాడు. తన ఇంటివరకు ఒక సొరంగం తవ్వాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | WhatsApp కొత్త నియమాలను పాటించపోతే ఎకౌంట్ డిలీట్ అవ్వవచ్చు


మెక్సికోకు (Mexico) చెందిన ఆల్బెర్టో అనే వ్యక్తి తన లవర్ నివాసానికి చేరడానికి తనకంటూ ఒక స్పెషల్ రూట్ ఉండాలి అనుకున్నాడు. అలా అనుకుని ఒక సొరంగాన్ని (Tunnel) కూడా నిర్మించాడు. అల్బెర్టో, అతని ప్రేయసి మధ్య ప్రేమ కథ చిన్ననాటి నుంచి కొనసాగుతోంది. అయితే ఇప్పుడు తను వివాహిత కావడంతో అతనికి సమస్యలు మొదలయ్యాయి. తనను బయట కలవడం కష్టంగా మారడంతో ఇలా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు.



Also Read | Honey: కల్తీ తేనె తీసుకుంటే అసలుకే మోసం, వెంటనే ఇలా టెస్ట్ చేయండి!


ఈ సీక్రెట్ ఎఫైర్ గురించి సదరు మహిళ భర్తకు (Husband) ఒక రోజు ఇంటికి వస్తేగానీ తెలియలేదు. ఇంట్లో ఏదో తేడా ఉండి అని చెక్ చేస్తే సొరంగం కనిపించింది. లోపలికి వెళ్లి వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook