Mobile Theft Video: మీరు ఇంటర్నెట్‌లో దొంగతనానికి సంబంధించిన చాలా వీడియోలను చాలానే చూసి ఉంటారు. కానీ, ఇప్పుడు మీకు ఒక దొంగతనం వీడియో చూపించబోతున్నాం. అలాంటి దొంగతనాన్ని మాత్రం మీరు కచ్చితంగా చూసి ఉండరు. ఎందుకంటే దొంగతనం అంత సులభంగా ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో ప్రకారం.. ఓ మహిళ దుర్మార్గంగా బ్యాగ్ లోని మొబైల్ ను దొంగలిస్తుంది. ఆ దొంగతనాన్ని చూస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యానికి గురవుతారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వైరల్ గా మారిన వీడియో ప్రకారం.. మొబైల్ దొంగిలించే విధానాన్ని చూస్తే మీ కళ్లను మీరే నమ్మలేరు. ఓ షాప్‌ వద్ద ఏదో కొంటున్న మహిళ భుజానికి హ్యాండ్ బ్యాగ్ తగిలించుకోని ఉంది. అయితే అంతలోనే ఆ షాప్ వద్దకు వచ్చిన మరో మహిళ ఆ హ్యాండ్ బ్యాగ్ జిప్ ను బయటకు ఉండడాన్ని గమనించింది. అంతలో స్పీడ్ గా ఆ దుకాణం వద్దకు రద్దీగా ఉన్నట్లు ఆమె తోసుకుంటూ వచ్చినట్లు ఆ మహిళ ప్రవర్తించింది. 


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by GiDDa CoMpAnY (@giedde)


ఆ తర్వాత తనకు కావాల్సిన వస్తువును దుకాణదారునికి చెప్పి తీసుకుంది. ఆ గ్యాప్ లో పక్కనే ఉన్న మరో మహిళ బ్యాగ్ జిప్ ఓపెన్ చేసి అందులోని మొబైల్ ను తస్కరించింది. చాలా తెలివిగా మొబైల్ ను దొంగిలించిన ఆమె.. ఆ స్మార్ట్ ఫోన్ ను తన బ్యాగ్ లో పెట్టుకొని ఏమి తెలియనట్లు అక్కడి నుంచి వెళ్లిపోయింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆ మహిళ చేసిన దొంగతనానికి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. 


Also Read: Viral Video: కారు నడుపుతుండగా స్పృహ కోల్పోయిన మహిళ.. తర్వాత ఏమైందంటే?


Also Read: Perk Ad Video: అలియా భట్ తో పారాగ్లైడింగ్.. భయంతో కేకలు పెట్టిన యువకుడు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.