Viral video: కోతికి గిఫ్ట్ ఇస్తే.. కోతి ఫేస్‌లో ఆ ఎక్స్ప్రెషన్ చూసి తీరాల్సిందే
కోతి పేరెత్తితేనే ముందుగా అందరికీ గుర్తుకొచ్చేది అది వేసే కోతి వేషాలు. అలాగే కొన్నిసార్లు అచ్ఛం మనుషుల్లాగే ప్రవర్తిస్తూ ఎంతో ఆకట్టుకుంటాయి. అలాంటి ఒక వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ ( Monkey video goes viral ) అవుతోంది.
కోతి పేరెత్తితేనే ముందుగా అందరికీ గుర్తుకొచ్చేది అది వేసే కోతి వేషాలు. అలాగే కొన్నిసార్లు అచ్ఛం మనుషుల్లాగే ప్రవర్తిస్తూ ఎంతో ఆకట్టుకుంటాయి. అలాంటి ఒక వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ ( Monkey video goes viral ) అవుతోంది. ఈ వీడియోలో ఉన్న కోతి పేరు జార్జ్. జార్జ్ తనకు గిఫ్టుగా వచ్చిన బాక్స్ తీసుకొని అందులో ఏం ఉందా అనే సందేహంతో ఎంతో ఎగ్జైటెడ్‌గా ఓపెన్ చేసింది. అందులో ఉన్న వాటర్ బాటిల్‌ని చూసిన కోతి తన కోతి చేష్టలతో ఆ బాటిల్ మూతని తెరిచి లోపలికి తొంగి చూసి తదేకంగా పరిశీలించింది. ఆ తరువాత అందులో ఏం లేదు అని గ్రహించిందేమో మళ్లి ఆ బాటిల్‌ని మూత పెట్టింది. అలాగే కోతి ఆ బాటిల్‌తో పాటు వచ్చిన మ్యానువల్‌ను 'చదవడం' ప్రారంభిచింది. ఆ కోతి ఆ మ్యానువల్‌ను అచ్ఛం మనుషుల్లాగే ఆ ప్రోడక్టుని ఎలా ఉపయోగించాలి అన్నట్లు చదువుతుంటే దాని ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే నవ్వు ఆపుకోలేరు. Also read: COVID-19: ఏపీ లేటెస్ట్ కరోనా హెల్త్ బులెటిన్
ఇప్పటికే ఈ కోతి వీడియో వైరల్ అవ్వడమే కాకుండా నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ కూడా చేస్తున్నారు. కోతి చేష్టలు చూసి ఎవరైనా నవ్వాపుకోలేరు. అందులోనూ ఈ కోతి చేష్టలు ఇంకా అదుర్స్ అనిపిస్తున్నాయి. Also read: Coronavirus: కరోనాపై గెలిచిన మరో సీఎం
మరిన్ని వైరల్ వీడియోల కోసం..
lizard in Sambar: సాంబార్‌లో సగం బల్లి.. ఇంకో సగం ఏమైందంటూ కస్టమర్ టెన్షన్
Viral video: స్విమ్మింగ్ కోసం వెళ్తే ఏమైందో చూడండి
Viral video: కూరగాయలు అమ్ముకునే యువతి ఇంగ్లీష్‌లో అధికారులను కడిగిపారేసింది