Monkey Plays with Snake video goes viral: సోషల్ మీడియాలో ప్రతిరోజు బోలేడు వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఏదైన వెరైటీ కంటెంట్, వింతైన ఘటనలు ఉంటే.. జనాలు వెంటనే తమ ఫోన్ లలో వీడియోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తుంటారు. దీంతో అవి ఇట్టే వైరల్ అవుతుంటాయి. అదే విధంగా..పాములకు చెందిన వీడియోలకు సోషల్ మీడియాలో యమక్రేజ్ ఉందని చెప్పుకొవచ్చు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వర్షాకాలంలో,చలికాలంలో పాముల బెడద ఎక్కువగా ఉంటుంది. ఎలుకల వేటలో అవి మనుషుల ఆవాసాలకు వస్తుంటాయి. బట్టలలో, బెడ్ షీట్ లలో, షూస్ లలో పాములు దూరిపోతుంటాయి. కొన్నిసార్లు అవి కిచెన్ లలో సజ్జల మీద, చెట్లలో ఉంటాయి. పాములు కన్పిస్తే కొంత మంది భయంతో అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయి, పాములు పట్టేవారికి సమాచారం ఇస్తారు.


 



మరికొందరు మాత్రం పాముల్ని చంపేందుకు తెగ ప్రయత్నాలు సైతం చేస్తుంటారు. పాములు వీడియోలు నిత్యం వైరల్ అవతుంటాయి. కొన్ని వీడియోలు చూస్తే షాక్ కుగురౌతుంటాం. మరికొన్ని వీడియోలు నవ్వుతెప్పిస్తుంటాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఒక ఆశ్చర్యపోయే విధంగా ఉన్న వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. 


పూర్తి వివరాలు..


ఒక వానరం పొలంలో ఫుర్సత్ గా కూర్చుని ఉంది. అయితే.. దాని పక్కన పాముకూడా ఉంది. అయితే.. అవి రెండు కూడా మంచి ఫ్రెండ్సో... లేదా మరేంటో కానీ.. ఆ పాము మాత్రం..కోతి దగ్గర కూర్చుని ఉంది. కోతి కూడా పామును చూసి భయపడటం లేదు. మరీ పాము కోరలు పేకేశారో ఏంటో కానీ.. పాము పలు మార్లు కోతిని కాటు వేయడం ఆ వీడియోలో కన్పిస్తుంది. అయిన.. ఆ కోతి మాత్రం.. పామును తన మెడలో వేసుకుని.. అచ్చం శివయ్యలా పోజ్ ఇస్తుంది.


ఆ పాము కూడా.. కోతి పట్టుకున్న.. ఎక్కువగా హనీ తలపెట్టినట్లు లేదు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది. అయితే.. కొంత మంది మాత్రం.. అవి రెండు మంచి ఫ్రెండ్స్.. అందుకే అలా ఉన్నాయని కొంత మంది కామెంట్లు చేస్తున్నారు.


Read more: Viral Video: హనుమంతుడి ఆలయంలో గదతో వానరం.. ఆనందంతో పొంగిపోతున్న భక్తులు.. వీడియో ఇదిగో..


మరికొందరు మాత్రం.. వామ్మో.. పాముకు విషం ఉంటుంది కదా.. అది కాటేసిన కోతికి ఏంకాలేదేంటని ఆశ్చర్యపోతున్నారంట. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.



 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.