Monolith: ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మోనోలిత్‌లు కనిపిస్తున్న విషయం తెలిసిందే. అమెరికాతో పాటు అనేక దేశాల్లో మోనోలిత్ దర్శనమిస్తున్నాయి. తాజాగా భారత దేశంలో కూడా మోనోలిత్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. మోనోలిత్ అంటే ఒక లోహపు నిలువెత్తు శిలా. ఇది ఒక స్థంభాన్ని పోలి ఉంటుంది. కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఇవి కనిపిస్తూ మాయం అవుతుంటాయి అని కొందరు చెబుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | Sky Walk In India: దేశంలో తొలి స్కైవాక్!  ఆ రాష్ట్రం వెళ్లాలి అంటే రూల్స్ పాటించాలి


అహ్మదాబాద్‌లోని సింపోని అడవిలో ఇటీవలే కొందరికి మోనోలిత్ కనిపించింది. దీని గురించి స్పందించిన అహ్మదాబాద్ మునిసిపల్ కార్పోరేషల్ అసిస్టెంట్ డైరక్టర్ దిలీప్‌ బాయి పటేల్...మోనోలిత్ అక్కడ ఉన్నట్టు తమకు తెలుసు అని.. వాటిని పార్కు సిబ్బందే ఉంచారని తెలిపారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతోంది.


దీనిపై కొన్ని నెంబర్స్ ఉన్నాయి అని.. అయితే వాటి అర్థం ఏంటో తమకు తెలియదు అని పేర్కొన్నారు. దాంతో పాటు దీన్ని తయారు చేసిన ఆర్టిస్ట్ కూడా తన పేరు బహిరంగపర్చడానికి ఇష్టపడలేదు. క్రిస్మస్ (Christmas) సమయంలో అనేక దేశాల్లో, ప్రాంతాల్లో కొత్తగా మోనోలిత్‌లు కనిపించినట్టు సమాచారం.


Also Read | Google Photos: వచ్చే సంవత్సరం నుంచి గూగుల్ ఫోటోస్ ఫ్రీ వర్షన్ మార్పులు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook