Google Photos Unlimited Storage to End Soon | గూగుల్ తన ప్రోడక్ట్స్ విషయంలో కీలక ప్రకటన చేసింది. త్వరలో గూగుల్ ఫోటోస్ ( Google Photos ) స్టోరేజ్ ను ఇకపై ఉచితంగా వినియోగించుకొనే వెసులుబాటు కల్పించింది. 15 జీబీల కన్నా ఎక్కువగా స్టోరేజీని వినియోగించుకోవాలి అంటే ఫీజు చెల్లించాల్సిందే.
2021 జూన్ 1 తేదీ నుంచి అన్ని ఫోటోలను, వీడియోలను ( Videos ) హైక్వాలిటీలో అప్లోడ్ చేయాలి అంటే డబ్బును స్టోరేజీని కొనుక్కోవాల్సి ఉంటుంది. 15 జీబీల లిమిట్ ను దాటితే గూగుల్ ఎకౌంట్ ను కొత్త లిమిట్ ను కొనుగోలచేయాల్సి ఉంటుంది. గూగుల్ డ్రైవ్, జీమెయిల్ ( Gmail ), ఫోటోస్ లో ఉండే ప్రతీ కేబీ ఈ 15జీబీలోకి యాడ్ అవుతుంది.
మీరు అప్లోడ్ చేసే వీడియో, లేదో హై క్వాలిటీ ఫోటోలను జూన్ 1, 2021లకు ముందు మీకు ఎలాంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. అది కూడా మీ 15 జీబి స్టోరేజీ నుంచి మాత్రమే వినియోగించుకోవచ్చు. అంటే జూన్ 1,2021 కి ముందు మీ గుగూల్ ( Google ) సర్వీసెస్ లో స్టోర్ ఫోటోలకు ఎలాంటి చార్జీలు అవసరం లేదు. మీరు మీ ఫోటోల క్వాలిటీని ఫోటోస్ యాప్ లోఉన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి సింక్ అనే ఆప్షన్ ద్వారా సెట్ చేసుకోవచ్చు అని గూగుల్ తెలిపింది.
ఈ మార్పు వచ్చిన తరువాత ప్రతీ గూగుల్ వినియోగదారుడు తన 15జీబిల స్టోరేజీలో 80 వాతం వరకు కెపాసిటీని మూడు సంవత్సరాల్లోపు వినియోగించుకోవచ్చు. అయితే స్టోరేజీ కెపాసిటీ అయిపోతే మాత్రం మీకు స్టోరేజీ కెపాసిటీ పెంచుకోమని మెయిల్ వస్తుంది.