Viral News | ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌‌లో ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. గోరఖ్‌పూర్‌‌లో ముఖ్యమంత్రి సామూహిక వివాహ వేదికలో అరుదైన వివాహం జరిగింది. 53 సంవత్సరాల తల్లి, 27 సంవత్సరాల కూతురు వివాహం ఆ సామూహిక వివాహ వేదికలో జరిగింది. మహిళ పేరు బేలీ దేవీ కాగా.. ఆమె భర్త 25 సంవత్సరాల క్రితం మరణించాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | EPFO ఖాతా ఉందా? అయితే ఈ 5 ప్రయోజనాల గురించి తెలుసుకోండి!


25 ఏళ్ల తరువాత ఆమె తన మరిదితో వివాహం చేసుకుంది. అతని వయసు సుమారు 55 ఏళ్లు. బేలీ దేవి భర్త రైతు కాగా.. అతను 55 సంవత్సరాల వరకు వివాహం చేసుకోలేదు. ఈ సామూహిక వివాహ వేదికలో మొత్తం 63 జంటలు ఒక్కటయ్యాయి. ఇందులో ఒక ముస్లిం జంటకూడా ఉంది. ఈ వార్త గురించి సోషల్ మీడియాలో (Social Media) బాగా చర్చలు జరుగుతున్నాయి.


Also Read | 2021 జనవరి నుంచి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు రూల్స్‌లో మార్పు, పూర్తి వివరాలు చదవండి!


బేలీ దేవి చిన్న కూతురు పేరు ఇందూ. గత వారం అక్కడ ఏర్పాటు చేసిన వివాహవేదికలో ఇందు 29 సంవత్సరాల రాహుల్‌ను పెళ్లి (Marriage ) చేసుకుంది. బేలీ దేవి మీడియాలో ఉద్యోగం చేస్తోంది. కాగా కార్యక్రమానికి జిల్లాలోని సీనియర్ అధికారులు, సెలబ్రిటీలు కూడా పాల్గొన్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook