Mother in law should die soon 20 rs note found in bhagyavanti devi goes viral: సాధారణంగా చాలా మంది గుళ్లకు వెళ్లి మొక్కులు తీర్చుకుంటారు. తమకు మంచి జాబ్ రావాలని, ఇష్టమైన అమ్మాయితో పెళ్లి జరగాలని కోరుకుంటారు. కొంత మంది కొబ్బరియాల్ని కొడతామని మొక్కుకుంటారు. మరికొందరు స్వీట్లు పంచుతామని మొక్కుకుంటారు. ఇంకొందరు మాత్రం.. తలనీలాలు, నిలువెత్తు బంగారం (బెల్లం).. ఇలా తమకు తోచిన విధంగా మొక్కులు మొక్కుకుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అవి తీరగానే టెంపుల్ కు వెళ్లి తమ మొక్కులు తీర్చుకుంటారు. మరికొందరు తమ మొక్కుల చిట్టాను వైట్ పేపర్ మీద రాసి పెట్టి హుండీలో వేస్తుంటారు. అయితే.. ఇటీవల కర్ణాటకలో వెరైటీ ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది. కలబురిగిలో  భాగ్యవంతి దేవీ ఆలయం ఉంది. ఆ  అమ్మావారు ఎంతో పవన్ ఫుల్ అని అక్కడి వాళ్లు భావిస్తుంటారు. అక్కడ ఏమి కోరుకున్న కూడా వెంటనే నెరవేరుతుందంట.


అయితే.. అక్కడికి ప్రతిరోజు వేలాదిగా జనాలు వచ్చి.. మొక్కులు మొక్కుకుంటారు. తమ మొక్కును కొంత మంది నోటు మీద, కాగితం మీద రాసి హుండీలో వేస్తుంటారు.  ఇటీవల హుండీ లెక్కింపు చేపట్టారంట. అయితే.. రూ. 20 నోటు మీద ఏదో రాసి ఉండటంను అక్కడున్న వారు గమనించారంట. అదేంటీ ఇలా ఉందని చూసి.. కాస్తంత గట్టిగా అబ్బర్జ్ చేశారంట. దాని మీద మా అత్త వీలైనంత త్వరగా చచ్చిపోవాలని అని రాసుందంట. ఇది చూసి ఆ హుండీ లెక్కిస్తున్న వారు ఆశ్చర్యపోయారంట.


Read more: Viral news: వీడెంట్రా ఇలా.. పీటల మీద పెళ్లి క్యాన్షిల్ చేసుకున్న వరుడు.. కారణం తెలిస్తే షాక్ అవ్వడం పక్కా..


పాపం.. ఆ అత్త ఎంత హింసిస్తే.. ఈ విధంగా రాసుంటారో అని అక్కడి వాళ్లు మాట్లాడుకున్నారంట. మరీ ఆ నోటు మీద  అలా రాసిందీ.. కోడలో లేదో అల్లుడో మాత్రం క్లారిటీ లేదు. కనుక కొంత మంది.. కోడలు రాసి హుండీలో వేసి ఉంటుందని దీన్ని వైరల్  చేస్తున్నట్లు తెలుస్తొంది. నార్మల్ గా అత్త కోడళ్లంటే.. మెజారీటీ చోట్ల గొడవలు ఉండటం చూస్తుంటాం. కానీ.. కొన్ని చోట్ల ఇటీవల అత్తలు కూడా.. అల్లుళ్లను సాధిస్తున్న ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రూ. 20 నోటు ఘటన మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter