uttar Pradesh groom cancels wedding delay roti serving: ఇప్పుడున్న పరిస్థితుల్లో పెళ్లి అవ్వడం మాత్రం ఒక గగనమే అని చెప్పుకొవచ్చు. అమ్మాయిలు గొంతెమ్మ కోరికల చిట్టాతో రెచ్చిపోతున్నారు. గవర్నమెంట్ జాబ్, సొంతిల్లు, పొలాలు, బ్యాంక్ బ్యాలెన్స్ మొదలైనవి అన్ని పక్కాగా అడుతున్నారు. అదే విధంగా ఎలాంటి బాధ్యతలు కానీ.. ఇంట్లో ఎవరు కానీ ఉండొద్దని చెప్పేస్తున్నారు. పెళ్లాయ్యాక.. ఎలా ఉండాలో.. ముందే కండీషన్లు పెట్టేస్తున్నారు. ఒకప్పుడు.. అమ్మాయిలు పెళ్లిళ్లు కుదరక ఇబ్బందులు పడేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యిందని చెప్పుకొవచ్చు.
అమ్మాయిలు తమ కోరికలతో చుక్కలు చూపిస్తున్నారు. ఈ క్రమంలో పీటల మీద ఇటివల అనేక పెళ్లిళ్లు మధ్యలోనే ఆగిపోతున్నాయి. కొన్నిసార్లు వరుడు పెళ్లి పీటలకు తాగి రావడం, వరుడికి ఇంగ్లీష్ రాకపోవడం, పెళ్లిలో వరుడికి బట్టతల ఉండటం మొదలైన ఘటనల వల్ల పెళ్లిళ్లు ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా.. ఉత్తర ప్రదేశ్ లో ఒక వెరైటీ కారణంలో పెళ్లి ఆగిపోయింది. ప్రస్తుతం ఇది వార్తలలో నిలిచింది.
ఉత్తర ప్రదేశ్ లో డిసెంబరు 22న ఒక పెళ్లి ఆగిపోయింది. ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీ జిల్లా, హమీద్‌పూర్ గ్రామంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తొంది. ఒక వరుడు పెళ్లి రోజు తన వాళ్లకు రోటీలు పెట్టడం ఆలస్యం అయ్యిందని పీటల మీద నుంచి లేచీ వెళ్లిపోయాడంట. అదే రోజు రాత్రి.. మరొ యువతి మెడలో తాళి బొట్టు కట్టేశారు. వధువు కుటుంబం చాలా ఆలస్యంగా రోటీలు వడ్డించిందని ఆరోపిస్తూ వరుడి పక్షంవాళ్లు చెప్పినట్లు తెలుస్తొంది.
అయితే.. వరుడు మరో యువతి మెడలో తాళి బొట్టుకట్టడంతో యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తొంది. ఇప్పటికే వరుడి ఇంటికి పంపిన కట్నం రూ.1.5 లక్షలతో కలిపి సుమారు రూ.7 లక్షల ఆర్థిక నష్టం వాటిల్లిందని వధువు కుటుంబీకులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై కేసు నమోదు చేయాలని అధికారులను కోరినట్లు సమాచారం. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter