Sai Baba Idol Drank Milk: పవిత్రమైన శ్రావణమాసం.. అది కూడా నాగుల పంచమి. హిందూవులకు అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజు అద్భుతం జరిగింది. తెల్లవారుజామునే లేచి హిందూవులు పెద్ద ఎత్తున పూజలు చేశారు. ఈ సమయంలో ఓ భక్తురాలు పూజ చేస్తున్న క్రమంలో షిర్డీ సాయిబాబాకు పాలతో పూజ చేశారు. ఈ సమయంలో సాయిబాబా విగ్రహం పాలు తాగుతుండడాన్ని గమనించారు. ఇలా ఒక్కసారి కాదు చాలా సార్లు విగ్రహం తాగుతుండడంతో ఈ విషయం వైరల్‌గా మారింది. ఇదెక్కడో కాదు హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో చోటుచేసుకుంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Teacher Kiss Video: 'నాకు ముద్దు ఇస్తే నీకు అటెండెన్స్‌'.. ప్రభుత్వ టీచర్‌ ముద్దులాట


హైదరాబాద్‌ వనస్థలిపురంలోని రాజీవ్ గాంధీ పార్క్ వద్ద ఉన్న మహంకాళి అమ్మవారి గుడి వద్ద వింత ఘటన చోటుచేసుకుంది. సాయిబాబా విగ్రహం పాలు తాగుతుండటంతో మహిళలు భారీగా చేరుకుని పూజలు చేశారు. నాగుల పంచమి సందర్భంగా ఒక మహిళ ఇంట్లో పూజ చేస్తుండగా సాయిబాబా విగ్రహానికి చెంచాతో పాలు తాగించారు. రెండుసార్లు పాలు తాగినట్లు గుర్తించిన ఆమె మరో రెండు మార్లు అలాగే చేసింది. పాల చెంచా ఖాళీ అయ్యింది.

Also Read: Snake: వామ్మో.. వనపర్తిలో కలకలం.. ఇంట్లో దూరిన పదడుగుల భారీ సర్పం.. వైరల్ గా మారిన వీడియో..


భక్తుల పూజలు
సాయిబాబా మహాత్యం ప్రజలందరికీ చూపించాలని  ఇంటికి సమీపంలోని మహంకాళి అమ్మవారి ఆలయానికి సాయి బాబా విగ్రహాన్ని తీసుకువచ్చారు. అక్కడ సాయిబాబాకు పూజలు చేశారు. అనంతరం ఇతర మహిళా భక్తులు కూడా పూజలు చేశారు. అనంతరం సాయిబాబా విగ్రహానికి పాలు తాగించారు. వాళ్లు తాగిస్తున్నా కూడా సాయిబాబా విగ్రహం పాలు తాగారని భక్తులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఈ వార్త చుట్టుపక్కల వ్యాప్తి చెందడంతో భక్తులు ఈ వింత చూడడానికి  పెద్ద ఎత్తున వస్తున్నారు.


నిజమా? వాస్తవమేమిటి?
సాయిబాబా పాలు తాగాడని చాలాసార్లు వార్తలు వచ్చాయి. అయితే అది వాస్తవం కాదని నాస్తికులు చెబుతున్నారు. తాజాగా వనస్థలిపురంలో జరిగిన సంఘటనపై కూడా నాస్తికులు, దేవుడిని నమ్మని వ్యక్తులు వాస్తవమేమిటో వివరిస్తున్నారు. ఇక జన విజ్ఞాన వేదిక కూడా ఇలాంటి వింత సంఘటనలు నమ్మవద్దని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సాయిబాబా విగ్రహం పాలు తాగడం వెనుక కూడా ఏదో ఒక శాస్త్రీయ కారణం ఉంటుందని నాస్తికులు చెబుతున్నాడు. దేవుడు పాలు తాగాడని చెప్పడం హాస్యాస్పదంగా పేర్కొంటున్నారు. ప్రజలు ఎవరూ అలాంటివి నమ్మవద్దని చెబుతున్నారు. ఎవరు ఏమీ చెప్పినా భక్తులు పట్టించుకోకుండా ఆ వింతను చూసేందుకు తరలివస్తుండడం గమనార్హం.





స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter