Nagamani Stone Video Watch: అపార ధనవంతులను చేసే నాగమణి ఎక్కడ లభిస్తుంది? ఈ వజ్రానికి మొగలి చెట్టుకు మధ్య అనుబంధమేంటి..
Rare Nagamani Stone Video: నాగమణి రత్నానికి మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంది. ఈ రత్నాన్ని ఇంట్లో ఉంచడం వల్ల ధనవంతుల అవ్వడమే కాకుండా అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందట. అంతేకాకుండా ఇది ఇప్పటికీ కొన్ని చోట్ల లభిస్తుందని సమాచారం. ఇది ఎలా ఉంటుందో పూర్తి వివరాలు తెలుసుకోండి.
Nagamani Stone Video Watch Now: మొగలిపూలు అంటే నాగు పాములకు ఇష్టమని భారతీయులు నమ్ముతూ ఉంటారు. వాళ్ళ నమ్మకాన్ని నిజం చేస్తూ దట్టమైన మొగ్గలి చెట్ల మధ్యలో చుట్టలు చుట్టుకుని పడుకుని ఉండే నాగు పాములు తరచూ కనిపిస్తుంటాయి. నిజంగా ఈ చెట్లంటే నాగుపాములకు అంత ఇష్టమా? ఆ వాసన వల్ల పాములకు కలిగి లాభం ఏమిటి? ఏ కారణంగా నాగుపాములు మొగలి చెట్లలో సంచరిస్తూ ఉంటాయి. ఇలాంటి చాలా ప్రశ్నలు మనలో వస్తూ ఉంటాయి. నిజానికి మొగలి చెట్టుకు కింగ్ కోబ్రాలకు ఉన్న స్నేహభావం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మొగలి చెట్ల మధ్య సంచరించే నాగుపాముల్లో కొన్ని ఇచ్ఛదారి సర్పాలు కూడా ఉండే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఏకాంత ప్రదేశాలలో ఉండే మొగలి పొదలలో సర్పాల జంటలు తన వేసుకుని ఉంటాయట.. కొన్నిసార్లు మొగలి పొదలలో నాగమణులు దొరికిన సందర్భాలు కూడా ఉన్నాయని సమాచారం.. గుడివాడ, మచిలీపట్నం రైలు మార్గంలో.. మచిలీపట్నం స్టేషన్కు ముందు వచ్చే చిలకలపూడి రైల్వే స్టేషన్ కి సమీపంలో గద్దర్లు అనేక మొగలి చెట్ల పొదరు దట్టంగా వ్యాపించి ఉండేది. సుమారు 80 సంవత్సరాల క్రితం విజయవాడకు చెందిన ఒక వ్యక్తి అనుకోకుండా ఆ మొగుని పొదలలోకి వెళ్ళాడు. ఆ సమయంలో అతనికి ఆ మొగలి పొదలలో ఒక లాగబడి దొరికిందట.. అప్పటివరకు నిరుపేదగా బ్రతికిన వ్యక్తి నాగమణి దొరకడంతో హఠాత్తుగా ధనవంతుడు అయిపోయాడని స్థానికులు చెబుతూ ఉంటారు.
ఆ వ్యక్తి వంశీకులు ఈనాటికీ విజయవాడలో జీవిస్తున్నారు. ఇప్పటికీ ఆ వంశి కుల వద్ద నాగమణి ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆ మణి కారణంగా ఆ కుటుంబం సంపన్నవంతంగా ఉంది. అంతేకాకుండా గతంలో కొంతమంది ధనవంతులు తమ డబ్బులను దాచుకునేందుకు ఒక ఖాళీ ప్రదేశంలో గుంత తవ్వి అందులో డబ్బులను పాతిపెట్టి.. మొగలిపూల చెట్లను నాటే వారట.. దీనివల్ల అక్కడికి పాములు చేరుకొని సెక్యూరిటీగా ఉండేవని సమాచారం. అంతేకాకుండా వారికి ఒక గుర్తుగా కూడా ఈ మొగిలి పువ్వు చెట్లు నిలిచేవట..
మొగలి పొదల మధ్య పౌర్ణమి అర్ధరాత్రి సమయంలో కూర్చుని వశీకరణ మంత్రాలు జపిస్తే.. మంత్ర సిద్ధి ఒక్క రాత్రికి కలుగుతుందని సమాచారం.. మొగలిచెట్టు వేరును క్యాష్ కౌంటర్ లో ఉంచుకుంటే విపరీతంగా సంపాదన పెరుగుతుందని కూడా పూర్వికులు అనేవారు. మొగలి చెట్టుని హిందీలో కేవడా అని పిలుస్తారు. ఇక మరాఠీలో కేతకి అని పిలుస్తారు. ఉర్దూలు కియోరా పిలుస్తారని సమాచారం.. అలాగే మొగిలి పువ్వులను ఇప్పటికీ కొంతమంది పండిస్తున్నారు. ఈ పూల నుంచి రసాన్ని తీసి వివిధ పర్ఫ్యూమ్స్ తయారీకి వినియోగించే వారికి విక్రయిస్తున్నారు. అలాగే ఇది వివిధ రకాల వంటకాల్లో కూడా వినియోగిస్తారని సమాచారం. ఏది ఏమైనా మన పూర్వకాలంలో మొగిలి చెట్టు కింద ఎంతో శక్తివంతమైన నాగమణి రత్నం ఉండేదని పూర్వీకులు చెబుతూ ఉంటారు. అయితే నాగమణి ఉన్నప్పటికీ అక్కడ ఎంతో ప్రమాదకరమైన పాములు కూడా ఉండేవని సమాచారం. అందుకే ఆ చెట్టు దగ్గరికి వెళ్లేందుకు కూడా అందరూ అంతగా ఆసక్తి చూపక పోయేదట.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.