Newborn Baby Walking: ప్రపంచంలో ఎన్నో వింతలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. అలాంటివి జరిగే సందర్భాల్లో కొందరు వాటిని కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో ప్రపంచమంతా చుట్టేలా చేస్తున్నారు. అలాంటి వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్ ను దున్నేస్తున్నాయి. ప్రస్తుతం ఓ ఫన్నీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కొందరు పిల్లలు చాలా యాక్టివ్ గా ఉంటారు. మరి కొంతమంది పిల్లలు.. వారి చిన్నతనంలో ఎన్నో వింత ప్రయత్నాలు చేస్తుంటారు. వాళ్ల వాళ్ల తెలివితేటలతో చూసేవాళ్లకి నవ్వు తెప్పిస్తారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఓ వీడియోలో బుడ్డోడు మాత్రం తాను పుట్టిన మొదటి రోజే తల్లీదండ్రులతో పాటు డాక్టర్లను షాక్ గురిచేశాడు. సాధారణంగా అప్పుడే పుట్టిన పిల్లలను లేచి నడవడానికి 6 నెలల నుంచి ప్రయత్నిస్తారు. కొంతమంది కాస్త ఆలస్యంగా అడుగులేసే అవకాశం ఉంది. అప్పటి వరకు పిల్లల ఎముకలు గట్టి పడేందుకు సమయం పడుతుంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో మాత్రం పుట్టిన వెంటనే నడుస్తూ అందర్ని ఆశ్చర్యానికి గురిచేశాడు. 


Also Read: Bharat vs India: దేశం పేరు మార్పుపై కేంద్రం వైఖరి ఇదే, జీ20 నేమ్‌ప్లేట్‌పై అదే


వీడియోలో ఏముంది..?
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్న ఈ వీడియోను యాక్టివ్ మామాస్ అనే ఇన్ స్టాగ్రామ్ పేజ్ పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్రకారం.. ఇందులో ఓ మహిళ, మగబిడ్డకు జన్మనిస్తుంది. బుడ్డోడు పుట్టిన మొదటి రోజునే మ్యాజిక్ చేశాడు. ప్రసవం తర్వాత చేతులపై ఎత్తుకున్న డాక్టర్లను షాక్ కు గురిచేశాడు. వీడియోలో అప్పుడే పుట్టిన శిశువును ఓ నర్సు ఎత్తుకొని ఉంటుంది. ఆ మగబిడ్డ వెంటనే నడుస్తున్నట్లు కాళ్లు అటు ఇటు ఊపుతూ ఉంటాడు. అది చూసిన నర్సు బుడ్డోడు ఇంకొంత నడిచేలా ప్రోత్సహిస్తుంది. అలా దాదాపుగా 10 అడుగులు వేస్తూ బుడ్డోడు ఆశ్చర్యానికి గురిచేశాడు. 



పుట్టిన పిల్లలకు అంత శక్తి ఉంటుందా..?
ఇదిలా ఉండగా.. అప్పుడే పుట్టిన పిల్లల్లో ఎముకలు చాలా బలహీనంగా ఉంటాయి. వెంటనే వాళ్లు లేచి నడిచే పరిస్థితి ఉండదు. కానీ, ఈ వీడియోలోని శిశువు నడవడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ వీడియోపై మరి కొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.


Also Read: IND vs PAK Dream11 Prediction Today Match: పాక్‌తో టీమిండియా బిగ్‌ఫైట్‌.. పిచ్ రిపోర్ట్, డ్రీమ్11 టీమ్ టిప్స్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇలా..  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook