ఆపండి.. సినిమాలో పెళ్లి సీన్ జరిగేటప్పుడు వినిపించే మాట. కానీ నిజ జీవితంలోనూ ఇలాంటి సన్నివేశం జరిగింది. అయితే సినిమా తరహాలో జరిగిన ఈ ఘటనలో పెళ్లిని ఆపింది బంధువులు, స్నేహితులు కాదు. స్వయంగా వధువే తన పెళ్లిని ఆపింది. ఏంటని అడిగితే కాసేపట్లో తన ప్రియుడు అక్కడికి వస్తున్నాడంటూ మండపంలో లేచి నిల్చునేసరికి వరుడు షాకయ్యాడు. తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ఈ ఘటన జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read : Mumbai Indians: ప్రపంచ రికార్డు నెలకొల్పిన ముంబై ఇండియన్స్


 


నీలగిరి జిల్లా ఉదగ గ్రామంలో ప్రియదర్శిని అనే యువతికి, ఆనంద్ అనే యువకుడికి వివాహం జరిపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరికాసేపట్లో వరుడు తాళి కట్టబోతున్నాడు అనే సమయంలో.. ఓ అరగంటసేపు ఆగు నా లవర్ వస్తాడని చెప్పి పెళ్లికొడుకు ఆనంద్‌కు షాకిచ్చింది వధువు. వేద మంత్రాలు మొదలవగానే వధువు ప్రియదర్శిని కీలక నిర్ణయం తీసుకుని వివాహాన్ని ఆపింది. వివాహ వేడుక నుంచి వరుడు వెళ్ళిపోయాడు.


Also Read : Rajasekhar Health: నిలకడగా రాజశేఖర్ ఆరోగ్యం.. హై ఫ్లో ఆక్సిజన్‌తో చికిత్స


 


(Video: Youtube/Chennai Tamil News)



వరుడితో పాటు అతడి బంధువులు, వధువు బంధువులు, పెళ్లికి హాజరైన వారు కూడా జరిగిన ఘటనతో షాకయ్యారు. వారు ఎంత నచ్చజెప్పినా వినలేదు. నా లవర్ వస్తాడు అరగంటసేపు ఆగండి అని చెప్పింది. చివరికి ఆమె ప్రియుడు మాత్రం రాలేదు. దాంతో వధువు ప్రియదర్శినికి ఏం చేయాలో పాలుపోలేదు. వరుడిపై నమ్మకం పోయింది. పెళ్లివేడుకలో వధువుకు భంగపాటు తప్పలేదు. మా మాట వింటే ఇలా అయ్యేది కాదంటూ వధువుకు బంధువులు అందరూ తిట్లు, శాపనార్థాలు పెట్టేశారు..   



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe