Mumbai Indians: ప్రపంచ రికార్డు నెలకొల్పిన ముంబై ఇండియన్స్

 Mumbai Indians vs Delhi Capitals IPL 2020లో భాగంగా ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టు అరుదైన ఘనతను సాధించింది. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)తో తలపడ్డ మ్యాచ్ ద్వారా ముంబై ఇండియన్స్ జట్టు ఆ ఘనతను అందుకుంది.

Last Updated : Nov 1, 2020, 07:39 AM IST
Mumbai Indians: ప్రపంచ రికార్డు నెలకొల్పిన ముంబై ఇండియన్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020)లో భాగంగా ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టు అరుదైన ఘనతను సాధించింది. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)తో తలపడ్డ మ్యాచ్ ద్వారా అత్యధిక టీ20 మ్యాచ్‌లు ఆడిన జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. అత్యధిక టీ20లు ఆడిన ప్రపంచ రికార్డును తన పేరిట ముంబై జట్టు లిఖించుకుంది.

ఇప్పటివరకూ ఇంగ్లీష్ కౌంటీ జట్టు సోమర్‌సెట్ 221 మ్యాచ్‌లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇటీవల ఈ రికార్డును సమం చేసిన ముంబై ఇండియన్స్.. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో తమ 222వ మ్యాచ్‌ను ఆడింది. దీంతో సోమర్‌సెట్ రికార్డును ముంబై ఇండియన్స్ అధిగమించింది.  మరోవైపు నిన్నటి మ్యాచ్‌లో ఢిల్లీ జట్టుపై ముంబై విజయం సాధించి ఐపీఎల్ 2020 పాయింట్ల పట్టికలో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.

 

కాగా, ఐపీఎల్ 2020లో ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగానూ ముంబై ఇండియన్స్ నిలిచింది. ఇప్పటివరకూ రెండో జట్టు ప్లే ఆఫ్స్ చేరలేదు. ఐపీఎల్‌లో 2013, 15, 17 మరియు 2019 సీజన్లలో ముంబై ఇండియన్స్ విజేతగా నిలవడం తెలిసిందే. ఈ సీజన్‌లో రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ గాయంతో జట్టుకు దూరం కాగా, పోలార్డ్ ముంబై జట్టును ముందుండి నడిపిస్తున్నాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

 

Trending News