Floods Viral Videos: భారీ వర్షాలు, వరదలు ఉత్తరాది విలవిల్లాడుతోంది. కొండలు, కోనలు దొర్లిపడుతున్నాయి. వరద నీటి ప్రవాహానికి ఇళ్లు, మార్కెట్లు, వంతెనలు కొట్టుకుపోతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉత్తరాదిన కురుస్తున్న భారీ వర్షాలతో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వరద ముప్పు ఏర్పడింది. ఇప్పటికే వాగులు, వంకలు, నదులు వరద ఉధృతితో అడ్డొచ్చినవాటిని కొట్టుకుంటూ పోతున్నాయి. కొండ ప్రాంతం కావడంతో ఎక్కడికక్కడ కొండ చరియలు విరిగిపడుతున్నాయి. కొండ చరియలు మీదపడి జనం ప్రాణాలు కోల్పోతున్నారు. వరద ధాటికి, కొండ చరియల్లో భారీగా వాహనాలు ధ్వంసమౌతున్నాయి. భారీ వర్షాలు ఇంకా కొనసాగనుండటంతో వాతావరణ శాఖ మరోసారి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 


ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశీలో గంగోత్రి జాతీయ రహదారిపై కొంచ చరియలు విరిగిపడటంతో పలు వాహనాలు ధ్వంసమై ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. యాత్రికులు గంగోత్రి నుంచి ఉత్తరకాశికి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కొండ చరియలు అదే పనిగా విరిగిపడుతుండటంతో సహాయక చర్యలు నిలిచిపోయాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూస్తుండగానే అంత పైనుంచి కొండ చరియలు, పెద్ద పెద్ద రాళ్లు ఎలా దొర్లుకుంటూ వచ్చాయో వీడియోలో స్పష్టంగా చూడవచ్చు.



ఇక మరోవైపు భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లో నదులు భయం గొలుపుతున్నాయి. తీవ్రమైన వరద ఉధృతితో జల ప్రళయాన్ని తలపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని వంతెనలు కొట్టుకుపోగా, చమేరాలోని బకన్ వంతెన రావి నది వరద ఉధృతికి ఎలా ఊగిపోతుందో చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి. వరద తాకిడి  రబ్బరు వంతెన ఊగినట్టుగా ఊగిపోతోంది. ఈ వీడియో ఇప్పుడు చాలా వైరల్ అవుతోంది.



Also read: Heavy Rains Alert: తెలంగాణలో వచ్చే మూడ్రోజులు భారీ వర్షాలు , బయటికి వెళ్లవద్దని హెచ్చరిక జారీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook