Shocking Video: సినిమాలో జరిగినట్టు ఊరి పొలిమేరలో క్షుద్రపూజలు జరిగాయి. కుంకుమ, పసుపు, దిష్టిబొమ్మ, కోడి బలి వంటి వాటితో అక్కడ పరిస్థితి భయానకంగా మారింది. తెల్లవారుజామున చూసిన గ్రామస్తులు భయాభ్రాంతులకు గురయ్యారు. ఊరికి చేతబడి చేస్తున్నారా? తమ గ్రామాలకు ఏం జరుగుతోంది? అనే భయాందోళన నెలకొంది. ఈ సంఘటన ఉమ్మడి అనంతపురం జిల్లాలోని తీవ్ర కలకలం రేపాయి. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Friends Stabbed: ప్రాణం తీసిన 'మొబైల్‌ ఫోన్‌' పార్టీ.. దావత్‌ ఇవ్వలేదని తోటి స్నేహితులే


శ్రీ సత్య సాయి జిల్లా లేపాక్షి మండలం పులిమితి, మానేంపల్లి ప్రధాన రహదారిలో బుధవారం అర్ధరాత్రి క్షుద్ర పూజలు జరిగాయి. ఉదయం గ్రామస్తులు లేచి కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లగా సరిహద్దులో పూజలు, రక్తం, నిమ్మకాయలు, కోడి బలి తీసిన ఆనవాళ్లు కనిపించాయి. ఉదయమే ఇలాంటి భయానక దృశ్యాలు కనిపించడంతో గ్రామంలో కలకలం రేపింది. నిమ్మకాయలు, రక్తము, ఉడికించిన అన్నం, పసుపు కుంకుమ, దిష్టిబొమ్మతో పూజలు చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Also Read: Viral Video: పిల్ల పామును పాప్‌కార్న్‌లా తినేసిన భారీ కట్ల పాము


అంతేకాకుండా కోడిని బలి ఇచ్చారు. పెద్ద ముగ్గు, మట్టితో రెండు అడుగుల బొమ్మ కూడా కనిపించాయి. ఎవరు చేశారా? అని రెండు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భారీ ఎత్తున ఈ క్షుద్ర పూజలు జరగడంతో గ్రామానికి ఏమైనా ముప్పు ఉంటుందా? అని స్థానికులు ఊహించుకుంటున్నారు. క్షుద్రపూజల వార్త పరిసర గ్రామాల ప్రజలకు కూడా తెలియడంతో సంఘటనా స్థలాన్ని చూసేందుకు వివిధ గ్రామాల ప్రజలు తరలివస్తున్నారు. కాగా తమకు ఎలాంటి కీడు జరగబోతుందా? స్థానికుల్లో అలజడి మొదలైంది. కాగా ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించినట్లు తెలుస్తోంది.


ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. క్షుద్రపూజలతో భయాందోళనలో ఉన్న ప్రజలకు భరోసా కావాల్సి ఉంది. భయాందోళనలో ఉన్న ప్రజలకు జన విజ్ఞాన వేదిక లాంటి స్వచ్ఛంద సంస్థలు, మేధావులు వచ్చి అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు. క్షుద్రపూజలతో ఎలాంటివి జరగవని.. అవన్నీ మూఢ నమ్మకాలని కొందరు కొట్టిపారేస్తున్నారు.




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.