Scary Snake Video: పిట్ట కొంచెం కూత ఘనం అంటే ఇదేనేమో.. చిన్న పాము పెద్ద గుడ్డు స్వాహా..!!
చిన్న పాము.. చిన్న నోరు.. పెద్ద పక్షి గుడ్డును ఎలా మింగేసిందో మీరే చూడండి. వీడియో వైరల్ అవ్వగా చూసిన ప్రతి ఒక్కరు భయంతో వణికిపోతున్నారు.. మీరే ఓ లుక్కేయండి!
Scary video of Snake: సాధారణంగా మనం పెద్ద కొండ చిలువ.. జంతువును లేదా మనిషిని మింగేసిన (Scary video of a snake) వీడియోలు చాలానే చూసి ఉంటాము.. అవునా.. ?? అయితే మీ ముందుకు ఒక వీడియో తీసుకొచ్చాము.. ఈ వీడియో చూస్తే తప్పక భయానికి గురవుతారు. ఒక పాము గుడ్డును మింగుతున్న వీడియో తెగ వైరల్ అవుతుంది. ఏంటి..? పాము గుడ్డు మింగటం సాధారణమే అనే కాదా మీ సందేహం.. కానీ ఒక చిన్న పాము పెద్ద సైజ్ లో ఉన్న గుడ్డును మింగుతున్న (Snake Swallow Egg) వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది..
వీడియో చూసిన తర్వాత, పాము దేనినైనా మింగడానికి తన నోటిని ఇంతలా తీరుస్తుందా? అని మీరు పక్కాగా ఆశ్చర్యపోతారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో భారీ గుడ్డును పాము మింగడం మీరు చూడవచ్చు. గుడ్డును ఉన్న సైజ్ చూస్తే.. ఎదో పెద్ద పక్షి గుడ్డు అని అనిపిస్తుంది. అంత పెద్ద గుడ్డును చిన్న నోరు ఉన్న పాము ఎలా మింగేసిందో మీరే చూడండి.
Also Read: Bheemla Nayak - RRR Updates: సిరివెన్నెలకు సంతాపంగా ప్రమోషన్స్ ఆపేసిన ‘భీమ్లానాయక్’, ‘ఆర్ఆర్ఆర్’
చిన్న నోటితో పెద్ద గుడ్డు స్వాహా..
వీడియోలో రెండు గుడ్లు ఉండటం మనం చూడవచ్చు.. ఆ సమయంలో ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు కానీ... నల్లటి కళ్లు గల పాము ఒకటి వాటి వద్దకు వచ్చి మింగటానికి ప్రయత్నించటం మనం చూడవచ్చు. పాము తన చిన్న నోటితో గుడ్డు పట్టుకోటానికి ప్రయత్నిస్తుంది.
గుడ్డు అంత పెద్దగా ఉంది.. ఈ చిన్న పాము తన చిన్న నోటితో మింగలేదు అనే ఆలోచన రావచ్చు. అయినా ఆ పాము మెల్లగా నోరు తెరుస్తూ.. అంత పెద్ద గుడ్డును మింగటం మనం చూడవచ్చు.. పాము నోరు విప్పుతున్న ఈ వీడియో చూస్తే, ఇంత చిన్న పాము అంత పెద్దగా నోరును ఎలా తెరిచిందో అని భయపడటం ఖాయం.
Also Read: Hair Dry With Pressure Cooker: ప్రెషర్ కుక్కర్ తో హెయిర్ డ్రై.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
చూస్తుండగానే గుడ్డు మాయం.. !!
అలా గుడ్డు మింగుతూ.. గుడ్డు సైజ్ లో నోరును విస్తరించి, కొన్ని సెకన్లలోనే గుడ్డును మింగేయటం మనం గమనించవచ్చు. ఈ వీడియో చూస్తే పాములు ఇంత ప్రమాదకరమా అని కూడా ఫీల్ అవుతారు. @Animal_WorId అనే ట్విట్టర్ ఖాతాలో వీడియో పోస్ట్ చేయగా.. అది కాస్త వైరల్ అయింది. వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు భయాందోళనలకు గురవుతున్నారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి