20 Years Old Woman Averts Train Accident: 70 ఏళ్ల మహిళ ఎంతో సమయస్పూర్తి చూపించి కొన్ని వందల మంది రైలు ప్రయాణికుల ప్రాణాలను రక్షించింది. ఒక రైలు భారీ ప్రమాదం బారిన పడకుండా అడ్డుకుని రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి ప్రశంసలు అందుకుంది. తనకెందుకులే అని అనుకోకుండానో లేక పైబడిన వయస్సు తనకు సహకరించదులే అని అనుకోకుండా పరిగెత్తుకుంటూ వెళ్లి ఎంతోమంది ప్రాణాలు కాపాడింది. మార్చి 21న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఆ వృద్ధురాలి పేరు చంద్రావతి. ఆమె స్వస్థలం కర్ణాటకలోని మంగళూరుకు సమీపంలోని కుడుపు ఆర్య మానే గ్రామం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చంద్రావతి మధ్యాహ్నం 2.10 గంటలకు మధ్యాహ్న భోజనం చేసి తన ఇంటి వరండాలో నిలబడి ఉండగా భారీ శబ్ధం వినిపించింది. పెళపెళమని వినిపించిన ఆ భారీ శబ్ధం ఏంటా అని వెంటనే ఇంట్లోంచి పరుగెత్తుకొచ్చి చూడగ.. తన ఇంటికి సమీపంలోనే ఉన్న రైలు పట్టాలపై ఓ భారీ వృక్షం కుప్పకూలింది. ఆ సమయంలో మంగళూరు నుంచి ముంబైకి వెళ్లే రైలు అక్కడి నుంచే వెళ్తుందని ఆమెకు తెలుసు. ఆ రైలు వచ్చి పట్టాలపై పడిన భారీ వృక్షాన్ని ఢీకొంటే భారీ ప్రమాదం జరుగుతుంది అని రాబోయే ప్రమాదాన్ని పసిగట్టిన ఆ వృద్ధురాలు తన ఇంట్లోనే ఎవరినైనా అప్రమత్తం చేసి ఆ ప్రమాదాన్ని ఆపాలని చూసింది.


ఇంకెవరినో అప్రమత్తం చేసి పంపించేంత సమయంలేదని భావించిన చంద్రావతి వెంటనే తన ఇంట్లో ఎరుపు రంగులో ఉన్న బట్ట కోసం వెతికింది. అదృష్టం కొద్ది వెంటనే రెడ్ కలర్ క్లాత్ కంటికి కనిపించింది. వెంటనే ఆ రెడ్ కలర్ క్లాత్ తీసుకుని రైలు పట్టాల వైపు పరుగెత్తింది. అదే సమయంలో రైలు కూత వినబడింది. దీంతో చంద్రావతి గుండె మరింత వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. అంత చేత కానీ ఆ వయస్సులోనూ.. రైలు ప్రమాదాన్ని నివారించాలన్న తపన చంద్రావతిని ధైర్యంగా ముందుకే పరుగెత్తేలా చేసింది. 


ఇది కూడా చదవండి : Golden Treasure in Fort: స్వతంత్రం వచ్చిన 30 ఏళ్లకు పాకిస్థాన్ ప్రధాని కన్నేసిన కోట.. కోట నిండా 60 ట్రక్కుల రహస్య నిధి


మంగళూరు నుంచి ముంబై వెళ్తున్న మత్సగంధ ఎక్స్‌ప్రెస్ రైలు అతి సమీంగా వచ్చేస్తోంది. రెడ్ కలర్ వస్త్రాన్ని ఊపుతూ పరిగెత్తుకొస్తున్న చంద్రావతిని గుర్తించిన లోకోపైలట్.. ఏదో ప్రమాదం పొంచి ఉందని పసిగట్టి బ్రేక్స్ అప్లై చేశాడు. కీసుమంటూ శబ్ధం చేసుకుంటూ పరుగెత్తుకొచ్చిన రైలు.. పట్టాలపై కూలిపోయిన భారీ వృక్షానికి అతి సమీపంలోకి వచ్చి ఆగిపోయింది. వృద్ధురాలు ఏ మాత్రం ఆలస్యం చేసినా రైలు వచ్చి పట్టాలపై పడిన చెట్టును ఢీకొట్టేదే. 


వృద్ధురాలు చంద్రావతి సాహసాన్ని కొనియాడిన లోకో పైలట్, ప్రయాణికులు.. ఆ ఘటనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. చంద్రావతి సాహసాన్ని గుర్తించిన రైల్వే పోలీసులు.. తాజాగా రైల్వే ఉన్నతాధికారుల సమక్షంలో ఆమెకు సన్మానం చేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆ రోజు జరిగిన ఆ ఘటనను గుర్తుచేసుకున్న చంద్రావతి.. తాను ఎలా రియాక్ట్ అయ్యాననే విషయాన్ని పూసగుచ్చినట్టు వివరించింది. తనకు హార్ట్ సర్జరీ అయ్యిందని.. కానీ ఆ సమయంలో రైలు ప్రయాణికుల ప్రాణాలు రక్షించాలనే తపనతో అదేమీ లెక్కచేయకుండా రైలుకు ఎదురెళ్లానని చెప్పుకొచ్చింది. నిజంగా ఈ పెద్దావిడ వయస్సే కాదు.. మనసు కూడా ఎంతో పెద్దది కదా.. రియల్లీ హ్యాట్సాఫ్ చంద్రావతమ్మ.


ఇది కూడా చదవండి : Saddest City in World: ప్రపంచంలోనే అత్యంత విషాదకరమైన నగరం.. జనాల ఆయుష్షు కూడా తక్కువే.. రక్తంలా ప్రవాహించే నది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook