Orphan Girl Inspiration Story: ఆ అమ్మాయిని చిన్నతనంలో రైల్వే స్టేషన్‌లో వదిలేసి వెళ్లారు తల్లిదండ్రులు.. అక్కడే భిక్షాటన చేస్తూ బతికింది ఆ చిన్నారి. అయినా కూడా కష్టపడి చదువుకుంది. ఈరోజు ఆమె ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బిహార్‌లోని పాట్నాకు (Patna) చెందిన ఓ బాలికను చిన్నతనంలోనే తల్లిదండ్రులు పాట్నా రైల్వే స్టేషన్‌లో వదిలివేసి వెళ్లారు. దీంతో బాల్యమంతా అక్కడే భిక్షాటన చేస్తూ బతికింది. ఇప్పుడు ఆమె ఎంతో మంది అమ్మాయిలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. పట్టుదల, దృఢ సంకల్పం ఉంటే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని ఆ అమ్మాయి నిరూపించింది . 


ప్రస్తుతం ఆమె తన ఉండే సిటీలోనే ఒక కేఫ్‌ (Cafe) రన్‌ చేస్తోంది. 19 ఏళ్ల జ్యోతికి ఇప్పటికీ తన తల్లిదండ్రులు ఎవరో తెలియదు. తన చిన్నతనంలోనే పాట్నా రైల్వే స్టేషన్‌ (Railway Station‌) ప్లాట్‌ఫామ్స్‌పై అనాథగా మిగిలింది. ఆమె తల్లిదండ్రులు రైల్వే స్టేషన్‌లో వదిలి వెళ్లగా.. భిక్షాటన చేసే దంపతులు చేరదీశారు.


జ్యోతి (Jyoti) బాల్యమంతా కూడా నిత్యకష్టాలే. అష్టకష్టాలు పడుకుంటూనే జీవనం సాగించింది. భిక్షాటన చేసే ఓ దంపతుల వద్దే ఆమె పెరిగింది. వారితో పాటు జ్యోతి కూడా రోజూ భిక్షాటన చేసేది. అలా భిక్షాటన (Begging) చేసి తక్కువగా డబ్బు వచ్చిన రోజుల్లో చెత్త కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగించాల్సి వచ్చేది.


చిన్నప్పుడు తనకు బాగా చదువుకోవాలనే కోరిక ఉండేదని తెలిపింది. కానీ బాల్యమంతా భిక్షాటనతో గడిచిపోయిందంటూ జ్యోతి ఆవేదన చెందింది. ఇక తాను చదువుకునే సమయంలో తనను పెంచిన తల్లిని కోల్పోయానంటూ జ్యోతి పేర్కొంది. అలా ఎన్నో కష్టాలు ఎదురైనా కూడా జ్యోతి మాత్రం వెనుకంజ వేయలేదు. 


ఇక రాంబో ఫౌండేషన్ (Rambo Foundation) అనే స్వచ్ఛంద సంస్థ జ్యోతికి చేయూతనిచ్చింది. పాట్నా జిల్లా యంత్రాంగం అంతా కూడా జ్యోతికి అండగా నిలిచారు. దీంతో ఆమె జీవితంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనే తాపత్రయంతో ముందుకు సాగింది.


ఇక పాట్నాలో రాంబో ఫౌండేషన్‌కు సంబంధించి ఐదు కేంద్రాలు ఉన్నాయని.. ఇక్కడ పేద, అనాథ బాలబాలికలకు విద్యను అందిస్తున్నామంటూ రాంబో ఫౌండేషన్ బిహార్ హెడ్ విశాఖ కుమారి తెలిపారు. జ్యోతి రాంబో ఫౌండేషన్‌లో సాయంతో తన చదువును కొనసాగించింది. మెట్రిక్యులేషన్ పరీక్షలో మంచి మార్కులతో పాస్‌ అయింది. ఆ తర్వాత ఆమె ఉపేంద్ర మహారథి ఇనిస్టిట్యూట్‌లో మధుబని పెయింటింగ్స్‌లో శిక్షణ తీసుకుంది. అలా పెయింటింగ్స్‌లో తన ప్రతిభను చాటింది.


కానీ జ్యోతి అంతటితో సంతృప్తి చెందలేదు. జీవితంలో మరింత ముందుకు సాగి... ఆదర్శంగా నిలవాలి అనుకుంది. అలా ఇప్పుడు ఒక సంస్థలో కేఫ్‌ (Cafe) రన్‌ చేసే ఉద్యోగం పొందింది. రోజంతా కేఫ్‌ రన్ చేస్తూనే.. ఖాళీ సమయాల్లో చదువుకుంటోంది జ్యోతి.


అంతేకాదు ఒకప్పుడు భిక్షాటన (Begging) చేసి ఎన్నో ఇబ్బందులకు గురైన జ్యోతి.. ఇప్పుడు తన సొంత సంపాదనతో జీవనం సాగిస్తోంది. సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు.. ఆమె మార్కెటింగ్ రంగంలో రాణించాలని భావిస్తోంది. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే.. తన సంపాదనతో ఒక అద్దె ఇంట్లో ఊంటూ.. ఖాళీ సమయంలో ఓపెన్ స్కూల్ (Open School) లెర్నింగ్ ద్వారా తన చదువును కొనసాగిస్తోంది. ఇలా అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.


Also Read: Mobile users: మీరు కూడా ఈ యాప్ వాడుతున్నారా ? అయితే మీ బ్యాంక్ బ్యాలెన్స్ గోవిందా..


Also Read: February New Rules: ఫిబ్రవరి 1 , రేపటి నుంచి మారనున్న కొత్త రూల్స్, నిబంధనలు ఇవే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook