Pakistan Lahore Man Brutally Attacked On Wife Over Chickent Curry Issue: కొందరు మగళ్లు షాడిస్టుల మాదిరిగా ప్రవర్తిస్తుంటారు.పెళ్లయ్యాక.. భార్య అందంగా లేదని, కట్నంతేలేదని గొడవలు పడుతుంటారు. ప్రతిదానికి కూడా ఏదోఒక వంకలు పెడుతూ ఆమెను సాధిస్తుంటారు. కొందరు భార్య చీరకట్టసరిగ్గాకట్టుకోలేదని వేధిస్తుంటారు. మరికొందరు భార్య కూరలో ఉప్పుసరిగ్గా వేయలేదని, భార్యకు ఇంటి పనులు రావని వేధిస్తుంటారు. ఇక భార్యలు కూడా తమ భర్త అసమర్థుడని, జీతం ఎక్కవగా లేదని,ఆస్తిపాస్తులు లేవని, మోసం చేసి పెళ్లి చేసుకున్నారని షాడిజం చూయిస్తుంటారు. అంతేకాకుండా.. ఇతరులలాగా తమ భర్త లేడని, బంగారం, కారులో తిప్పడం లేదని కూడా భర్తను సూటీపోటీ మాటలతో సాధిస్తుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



పెళ్లయ్యాక ఇద్దరుపెరిగిన పరిస్థితులు, మనుషులు, అలవాట్లు ఎంతో భిన్నంగా ఉంటాయి. కొన్నిసార్లు గోడవలు, బేధాభిప్రాయాలు వస్తుంటాయి. కానీ కొందరు భర్తలు మాత్రం అదే పనిగా భార్యలను వేధించడమే పనిగా పెట్టుకుంటారు. సోషల్ మీడియాలో భార్యభర్తల గొడవలకు సంబంధించిన ఎన్నో ఘటనలు వార్తలలో నిలుస్తుంటాయి. తాజాగా, మరో ఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. 


పూర్తి వివరాలు..


పాకిస్థాన్ లోని లాహోర్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగవైరల్ గా మారింది. షెహబాజ్ అనే వ్యక్తి, తన ఇంటికి వచ్చాడు. అప్పటికే అతని భార్య డిన్నర్ ప్రిపేర్ చేసింది. కానీ అతగాడు అన్నం కర్రీ తిన్నాక ఆవేశంతో ఊగిపోయాడు. తన భార్యతో గొడవకు దిగాడు. కర్రీ ఎందుకు బాగాలేదని నిలదీశాడు. దీంతో ఇద్దరిమధ్య మాట మాట పెరిగింది. ఇంట్లో ఉన్న అత్తామామలు కనీసం వీరి గొడవలను ఆపేప ప్రయత్నం చేయలేదు. దీంతో షెహబాజ్ భార్యను మిద్దెపై నుంచి కిందకు తోసేశాడు.


Read More: Teen Girl reel At Airport: ఎయిర్ పోర్టులో యువతి రచ్చ.. లగేజీ ట్రాలీపై పడుకొని రీల్స్.. వైరల్ గా మారిన వీడియో..


దీంతో ఆమె గట్టిగా కేకలు పెడుతూ నెలపై పడింది. ఆమెనడుము భాగంలో తీవ్రమైన గాయాలైనట్లు తెలుస్తోంది. ఆమె పడిన ఘటన అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. వెంటనే చుట్టుపక్కల ఉన్న వారు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇదేం షాడిజమంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. మరికొందరు మాత్రం ఇతగాడిని కఠినంగా పనిష్మెంట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని, అతని అత్తామామలను కూడా అరెస్టు చేసినట్లు సమాచారం. 
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook