Umbrella In Plane: భారీ వర్షం ( Heavy Rainfall ) పడుతున్నా విమానం వేగంగా దూసుకెళ్తుంది. తుపానులో కూడా దాని వేగం ఏ మాత్రం తగ్గదు. పరిస్థితి ఎలా ఉన్నా విమానంలో ఉన్న ప్రయాణికులు మాత్రం సేఫ్‌గానే ( Safety Of Passengers ) ఉంటారు. అయితే విమానంలో వర్షం పడితే లోపల ఉన్న ప్రయాణికుల పరిస్థితి ఎలాా ఉంటుంది? భయంకరంగా ఉంటుంది కదా...ఎందుకంటే విమానంలో వర్షం రావడం అనేది ఎవరూ ఊహించని విషయం. అది  సాధారణ విషయం కాదు. కానీ ఇలాంటి ఒక సంఘటన రష్యాలో జరిగింది. రష్యాకు చెందిన ఒక డొమెస్టిక్ ( Domestic Flight ) విమానం ఎప్పటి లాగే టేకాఫ్ ( Take Off ) తీసుకుని బయల్దేరింది. గాల్లో ఉండగా సడెన్‌గా విమానం సీలింగ్ నుంచి టిప్ టిప్ అంటూ నీరు కారడం ( Water Leakage ) మొదలైంది. Also Read :Indian Bullfrog: రంగులు మార్చే కప్పను చూశారా ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీంతో ఖంగారు పడ్డ ప్రయాణికులు విండో నుంచి బయటికి చూశారు. బయట వర్షం పడటం లేదు. మరి ఈ నీరు ఎలా పడుతుంది అని స్టాఫ్‌ను ప్రశ్నించారు. 




మొదట విమానం సిబ్బంది కూడా ఖంగారు పడి ఒకసారి మొత్తం విమానంలో ఎక్కడెక్కడ ఈ సమస్య ఉంది అని చెక్ చేశారు. అయితే కొన్ని చోట్ల మాత్రం నీరు కారుతోంది అని గమనించి అక్కడికి వెళ్లి చెక్ చేశారు. చివరికి ఎయిర్ కండిషన్‌ (Air Conditioner ) లో ఏదో సమస్య రావడంతో అక్కడి నుంచి నీరు కారుతోంది అని తెలుసుకున్నారు. దగ్గరిలోని ఎయిర్పోర్టును ( Airport ) కాంటాక్ట్ చేసి అక్కడ ల్యాండింగ్ చేయాలని కెప్టెన్ నిర్ణయంచారు. కానీ అప్పటి వరకు ప్రయాణికులు తడవకుండా ఉండేందుకు వారికి గొడుగులు అందించారు.   Read : Honeymoon: హనీమూన్‌కి ప్రేయసినీ కూడా తీసుకెళ్లాడు...అడ్డంగా దొరికాడు


ఇలా ఎందుకు జరిగింది అనే దానిపై అక్కడి అధికారులు దర్యాప్తు చేపట్టారు. దీనికి కారణం ఎవరైనా ఉపేక్షించేది లేదు అంటున్నారు. అయితే విమానంలో గొడుగుపట్టుకునే ( Umbrella In Plane ) ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది అంటున్నారు. ఈ స్పెషల్ ప్లైట్ మళ్లీ ఎప్పుడు నడిపిస్తారో చెప్పండి బుక్ చేసుకుంటాం అని అని కొంత మంది కామెడీ కూడా చేస్తున్నారు. 


వైరల్‌గా మారిన Ruhi Singh hot photos