POCO M2: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో POCO M2
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ( Flipkart Billion Days Sale ) స్మార్ట్ టీవీలు మాత్రమే కాదు స్మార్ట్ ఫోన్లు కూడా హాట్ కేకుల్లా బుక్ అవుతున్నాయి. అందులో చాలా మంది సొంతం చేసుకోవడానకి ప్రయత్నిస్తున్న ఫోన్ పోకో ఎమ్2 ( POCO M2).
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ( Flipkart Billion Days Sale ) స్మార్ట్ టీవీలు మాత్రమే కాదు స్మార్ట్ ఫోన్లు కూడా హాట్ కేకుల్లా బుక్ అవుతున్నాయి. అందులో చాలా మంది సొంతం చేసుకోవడానకి ప్రయత్నిస్తున్న ఫోన్ పోకో ఎమ్2 ( POCO M2). ఎందుకంటే ఈ ఫోన్ పై అద్భుతమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. దాంతో పోకో ఫోన్ ఇష్టపడేవాళ్లు ఈ ఛాన్స్ మిస్ అవ్వాలి అనుకోవడం లేదు.
READ ALSO: Amazon, Flipkart భారీ సేల్, అద్భుతమైన ఆఫర్లు, మరెన్నో
ఫ్లిప్‌కార్ట్ లో ప్రస్తుతం పోకో ఎమ్2పై అద్భుతమైన డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయి. రూ.9,000 కన్నా తక్కువ రేంజ్ ఫోన్స్ లో ఇది అందుబాటులో ఉండటం వల్ల చాలా మంది ఏవిధంగా అయినా ఈ ఫోన్ సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
64 జీబీల ఫోన్ పై ప్రస్తుతం రూ.1,500 డిస్కౌంట్ లభిస్తోండటంతో ఈ ఫోన్ రూ.8,999కు లభిస్తోంది. అయితే ఈ డిస్కౌంట్ సొంతం చేసుకోవాలి అనుకుంటే మీరు SBI డెబిట్ లేదా క్రెడిట్ కార్డును వినియోగించాలి.
పోకో ఎమ్2 ఎందుకుకొనాలి ?| Why To Buy Poco M2 Mobile
పెర్ఫార్మెన్స్, ఫీచర్స్ విషయంలో పోకో ఎమ్2కు తిరుగులేదు. అది కూడా సుమారు రూ.9,000 రేంజ్ లో లభిస్తోంది. రియల్ మీ ( Realme ), రెడ్మీ ( Redmi ) ఫోన్లకు ఈ ఫోన్ గట్టీపోటీని ఇస్తోంది. లుక్ కూడా అమేజింగ్ అవడం దానికి మరో ప్రత్యేకత.
READ ALSO: Navratri 2020: అమ్మవారికి ఏ రోజు ఎలాంటి పూజలు జరగాలి ? ఘటస్తాపన ముహూర్తాలు ఏంటి ?
పోకో ఎమ్2 ప్రత్యేకతలు | Poco M2 Specifications
డిస్ ప్లే - 6.53 ఇంచులు.
ఫుల్ HD రిజల్యూషన్ తో సినిమాలు ( Movies) చూడటం, గేమ్స్ ఆడటం మరింత సరదగా మారనుంది. దాంతో పాటు ఈ ఫోన్ లో 6 జీబి ర్యామ్ తో పాటు స్టోరేజ్ ను 128జీబీలకు పెంచుకునే అవకాశం ఉంది. 512 జీబీల వరకు కూడా పెంచుకోవచ్చు. మిడ్ టైర్ గేమింగ్ కు అత్యంత అనుకూలం.
కెమెరా | Poco M2 Camera Specifications
13 మెగాపిక్సెల్స్ లెన్స్ తో పాటు,
8 మెగా పిక్సెల్స్ అల్ట్రా వైడ్ లెన్స్,
5 మెగా పిక్సెల్స్ మాక్రో లెన్స్
2 మెగా పిక్సెల్స్ డెప్త్ సెన్సార్స్ అందుబాటులో ఉన్నాయి.
ALSO READ | Wall Colour for Wealth: గోడలకు ఈ రంగులు వేయడం వల్ల సంపద, ఆరోగ్యం కలుగుతుంది
బ్యాటరీ | Poco M2 Battery
5000mAh బ్యాటరీ వల్ల ఒక్కసారి చార్జ్ చేస్తే సుమారు రెండు రోజుల పాటు ఫోన్ నడుస్తుంది.
దీంతో 18వాట్స్ చార్జర్ వస్తుంది. ఇది త్వరగా చార్జ్ చేస్తుంది.
పోకో ఎమ్2 ఇతర ప్రత్యేకతలు
రెండు మైక్రో ఎస్డీ కార్డు స్లాట్స్
డ్యూయల్ బ్యాండ్ వైఫై
3.5 ఎమ్ ఎమ్ హెడ్ ఫోన్ జాక్
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3
రంగులు | Poco M2 Colours
బ్లాక్
స్లేట్ బ్లూ
బ్రిక్ రెడ్
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR