Prison ATM: బీహార్ జైలులో ఏటీఎం..ఖైదీలు ఇక డబ్బు తీసుకోవచ్చు!
Prison ATM In Bihar | బీహార్ రాష్ట్రంలోని ఖైదీలు ఇక తమ జైలులోనే ఏటీఎం సేవలను వినియోగించుకోగలరు. బీహార్ లోని పూర్ణియా జైలులో ఏటీఎం సెంటర్ ఏర్పాటు చేసి ఖైదీలు తమ నిత్యావసరాల కోసం డబ్బులు తీసుకునే వెసులుబాటు కల్పించారు.
ATM In Bihar Jail | బీహార్ రాష్ట్రంలోని ఖైదీలు ఇక తమ జైలులోనే ఏటీఎం సేవలను వినియోగించుకోగలరు. బీహార్ లోని పూర్ణియా జైలులో ఏటీఎం సెంటర్ ఏర్పాటు చేసి ఖైదీలు తమ నిత్యావసరాల కోసం డబ్బులు తీసుకునే వెసులుబాటు కల్పించారు. ఇలా చేయడం వల్ల జైలు గేటు వద్ద అందులో ఉండేవారి సంఖ్య ను తగ్గించి వారికి డబ్బు అందుతుంది అని అధికారులు తెలిపారు. దాంతో కోవిడ్-19 ప్రమాదం కూడా తగ్గుతుంది అని వారంటున్నారు.
Also Read | Photo Story: నటాలియా గరిబోటో ఎవరు ? పోప్ నిజంగా ఆమె ఫోటోకు లైక్ కొట్టారా?
బీహార్ లోని (Bihar) పూర్ణియా జైలు అధికారుల ప్రకారం...జైలులో ఏటీఎం సదుపాయం కల్పించమని స్టేట్ బ్యాంకును (SBI) కోరగా... 15 రోజుల్లో ఏర్పాటు చేస్తామని బ్యాంకు అధికారులు తెలిపారట. పూర్ణయా జైలులో మొత్తం 750 మంది ఖైదీలు ఉండగా..అందులో 600 మందికి బ్యాంకు ఖాతాలు ఉన్నాయట. వారిలో 400 మంది వద్ద ఏటీఎం కార్డులు ఉన్నాయి. మిగితా వారికి కూడా త్వరలోనే ఏటీఎంలు అందజేస్తాం అని జైలు అధికారులు తెలిపారు.
Also Read | Marriage Muhurat: నవంబర్ 2020 నుంచి ఏప్రిల్ 2021 వరకు వివాహ, శుభ ముహూర్తాలు
జైలు ఆవరణంలో లభించే సబ్బు, కొబ్బరి నూనె, ఆహర పదార్ధాలు (Food), ఇతర వస్తువులను కొనుగోలు చేయడానికి ఈ డబ్బును ఖైదీలు ఉపయోగించుకుంటారు. దీంతో పాటు ఖైదీలకు డబ్బు ఇవ్వడానికి వచ్చే బంధుమిత్రుల సంఖ్య తగ్గుతుంది అని... వారు డైరక్ట్ గా ఖాతాలోనే వేయగలరు అని తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe