Viral Video: ఆ ఒక్కపనిచేస్తే మొబైల్ రీచార్జ్ చేస్తా.. షాప్ ఓనర్ దుమ్మురేగ్గొట్టిన అమ్మాయిలు.. వైరల్ గా మారిన వీడియో..
Rajasthan news: షాపు ఓనర్ కు అమ్మాయిలు చుక్కలు చూపించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం వావ్.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Rajasthan Girls slap and beats up shopkeeper video viral: ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన, ఎన్ని కేసులు పెట్టిన మాత్రం కామాంధులు తమ బుధ్ది మార్చుకొవడంలేదు. ఆడవాళ్లు.. కన్పిస్తే చాలు.. పశువుల మాదిరిగా ప్రవర్తిస్తున్నారు. ప్రతి రోజు మహిళలపై వేధింపులకు చెందిన ఘటనలు వార్తలలో ఉంటున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు ఇంటి నుంచి బైటకు వెళ్లిన వారు తిరిగి రావడం ప్రస్తుతం రిస్క్ లాగా మారిందని చెప్పుకొవచ్చు. అమ్మాయిలు సెఫ్టీ మాత్రంప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకొవచ్చు. గుడి, బడి, బస్టాండ్, రైల్వే స్టేషన్ ఇలా ప్రతి చోట మహిళలు వేధింపులకు గురౌతున్నారు.
చివరకు కొంత మంది ఇంట్లో కంటికి రెప్పలా కాపాడాల్సిన వారు సైతం వేధిస్తున్నారు. అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్ కు వెళ్తే.. అక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. ఈ క్రమంలో ప్రస్తుతం మహిళల మనుగడ ఒకరకంగా ప్రశ్నార్థకంగా మారిందని కూడా చెప్పుకొవచ్చు.ఈ నేపథ్యంలో అమ్మాయిల్ని వేధింపులకు గురిచేస్తున్న మరో ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు..
రాజస్థాన్ లోని తిడ్వానా పరిధిలో దారుణం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న కుచుమాన్ సిటీలో ఒక మొబైల్ షాప్ ఉంది. అక్కడికి కొంత మంది స్కూల్ అమ్మాయిలు రీచార్జ్ కోసం వెళ్లారు. అప్పుడు అక్కడ ఉన్న షాపు ఓనర్ అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఫోన్ రీచార్జ్ చేయాలంటూ ఐలవ్ యూ చెప్పాలని వేధించాడు. అంతే కాకుండా.. అమ్మాయిల పట్ల నీచంగా ప్రవర్తించాడు.
Read more: Nagababu: నాగార్జున కు బిగ్ షాక్.. హైడ్రాపై సీఎం రేవంత్ ను పొగుడుతూ సంచలన ట్విట్ చేసిన నాగబాబు..
దీంతో ఆ స్కూల్ అమ్మాయిలు తిరగబడ్డారు.తమ తొటి స్కూల్ అమ్మాయిల్ని, సీనియర్ లను తీసుకెళ్లి రచ్చ రచ్చ చేశారు. షాపు ఓనర్ ను గల్లా పట్టుకుని బైటకు తీసుకొచ్చి కొట్టుకుంటూ లాక్కెళ్లారు. అమ్మాయిలంటే.. అంత అలుసుగా ఉందా.. అంటూ రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్లారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్న చూసిన నెటిజన్లు వావ్.. సరైన బుద్ది చెప్పారంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.