Rat swimming in chutney at sangareddy sultanpur JNTU boys hostel: సాధారణంగా చాలా మంది ఇటీవల కాలంలో ఎక్కువగా ఆన్ లైన్ లలో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటున్నారు. టెక్నాలజీ పుణ్యామా .. అని ప్రస్తుతం  బోలేడు ఫుడ్ యాప్ లు అందుబాటులోకి వచ్చాయి. అదే విధంగా యాప్ లకు కూడా డిమాండ్ ఉంటుంది. తరచుగా ఈ యాప్ ల ద్వారానే ఎక్కువ మంది తమకు కావాల్సిన ఫుడ్ లను ఆర్డర్ లు పెట్టుకుంటారు. ఇదిలా ఉండగా.. ఇటీవల కొన్ని ఫుడ్ ఆర్డర్ లలో చనిపోయిన జంతువుల అవశేషాలు వస్తున్నాయి. బొద్దింకలు, పురుగులు వస్తున్నాయి. కొన్ని చోట్ల చనిపోయిన పాముల అవశేషాలు సైతం వచ్చాయి. ఇక చేతివేళ్లు కూడా ఐస్ క్రీమ్ లో వచ్చిన సంఘటన హట్ టాపిక్ గా మారింది. ఇక హైదరాబాద్ లో వరుసగా ఫుడ్ ఆర్డర్ సంస్థలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



దీంతో ఫుడ్ సెఫ్టీ అధికారులు రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. వీరి తనిఖీల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రోజుల తరబడి కుళ్లిపోయిన మాంసం ఆనవాళ్లు, ఎక్స్ పైరీ అయిపోయినటువంటి ఫుడ్ పౌడర్ లను ఉపయోగిస్తున్నారు.చాలా మంది ఇప్పటికే తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటనలు కొకొల్లలు. దీంతో ఫుడ్ సెప్టీ అధికారులు చాలా చోట్ల ఆయా హోటళ్లు, రెస్టారెంట్ ల వాళ్లకు నోటీసులు సైతం జారీ చేశారు. ఇదిలా ఉండగా.. తాజాగా, ఒక ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.



సుల్తాన్‌పూర్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ హాస్టల్‌ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కాలేజీ..క్యాంటీన్‌ మెస్‌‌లో చట్నీ గిన్నేలో చిట్టెలుక కన్పించింది. దీంతో విద్యార్థులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. దీన్ని వీడియో తీసి, తమ బాధలు ఇవంటూ ఉన్నతాధికారులకు,సోషల్ మీడియాలో ట్యాగ్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. ఈ ఘటన ఉన్నతాధికారుల వరకు వెళ్లింది. కాగా,  యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుందని సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. మరోవైపు ఈ వీడియో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తీవ్రంగా స్పందించారు.


Read more: Bus Accident: ఒళ్లు గగుర్పొడిచే ఘటన.. చూస్తుండగానే లోయలో పడిపోయిన బస్సు.. వీడియో వైరల్..


సుల్తాన్‌పూర్ జేఎన్టీయూ ఘటనపై వివరణ ఇవ్వాలంటూ జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో యూనివర్సిటీలోని క్యాంటీన్ మెస్‌ను జిల్లా ఉన్నతాధికారులు పరిశీలించారు. ఆ క్రమంలో పరిసరాల పరిశుభ్రతపై మెస్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఈ ఘటనపై అటు విద్యార్థులతోపాటు మెస్ సిబ్బందిని వివరణ కోరారు. అయితే యూనివర్సిటీ క్యాంటీన్ మెస్‌లో ఆహార పదార్థాలపై ఉన్నతాధికారులకు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. దీంతో క్యాంటీన్ కాంట్రాక్టర్‌ను మార్చాలని ఆదేశించారు. ఇటువంటి ఘటనలు  మరల కాకుండా ఉండాలని మెస్ సిబ్బందిని జిల్లా ఉన్నతాధికారులు హెచ్చరించారు. ఈ ఘటనతో విద్యార్థులు మాత్రం తీవ్ర భయాందోళనలకు గురైనట్లు తెలుస్తోంది.  ఈ వీడియో మాత్రం వైరల్ గా మారింది.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి