ఈ రోజుల్లో చేతిలో స్మార్ట్ ఫోన్ ( Smartphone ) ఉండటం అనేది అత్యంత అవసరం అయిన విషయం. అలాగా స్మార్ట్ ఫోన్ లో ఇంటర్నెట్ ఉండటం కూడా అత్యవసరంగా మారింది. పేమెంట్స్ నుంచి కొత్త స్థలానికి వెళ్లడం వరకు ఎన్నో విధాలుగా స్మార్ట్ ఫోన్ ఉపయోగపడుతుంది. అందుకే నేడు స్మార్ట్ ఫోన్ లో మ్యాప్స్ వినియోగం బాగా పెరుగుతోంది. ఫోన్ లో ఉన్న జీపీఎస్ సర్వీస్ వల్ల మీరు వెంటనే మీ లొకేషన్ ను షేర్ చేయవచ్చు. ఇలా జీపిఎస్ వల్ల మీ గమ్యస్థానానికి సులువుగా చేరుకోవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING



ఒక వేళ మీరు కొత్త ప్రాంతానికి వెళ్తే గూగుల్ మ్యాప్స్ ( Google Maps) మీకు దిశానిర్ధేశం చేసే సాధనం ( Navigation Tool ) గా ఉపకరిస్తుంది. అయితే ఫోన్ లో ఇంటర్నెట్ యాక్సిస్ లేనప్పుడు కాస్త ఇబ్బంది కలుగుతుంది. కొన్ని సార్లు సెల్యూలర్ నెట్ వర్క్ వల్ల ఇంటర్నెట్ అందుబాటులో ఉండకపోవచ్చు. ఇలాంటి సమయంలో కూడా మీరు జీపిఎస్ ను వినియోగించుకోవచ్చు. అంటే ఆఫ్ లైన్లో కూడా మీరు మీ గమ్యస్థానానికి చేరుకోవచ్చు.


దీని కోసం మీరు కొన్ని విషషయాలు, విధివిధానాలు ఫాలో అవ్వాలి. యాండ్రాయిడ్ ( Android ) లేదా ఐఫోన్ ( iPhone ) పై మ్యాప్స్ యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే ముందస్తుగా మీరు ఆ లొకేషన్ ను సేవ్ చేసుకుని ఉండాలి. 



తరువాత మీరు ఆఫ్ లైన్ జీపీఎస్ ను స్టార్ట్ చేయాలి.


కొన్ని సార్లు మనం టూర్ లేదా కొత్త స్థలానికి వెళ్లినప్పుడు మనకు ఇంటర్నెట్ అందుబాటులో ఉండకపోవచ్చు. అది ముందే గమనించి మనం సేఫ్ సైడ్ గా లొకేషన్ ను డౌన్ లోడ్ లేదా మ్యాప్ ను సేవ్ చేసుకోవడం అలవాటు చేసుకుంటే ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చు.


అనంతరం ఇలా చేయాలి...



- స్మార్ట్ ఫోన్ లో గూగుల్ మ్యాప్స్ యాప్ ను స్టార్ చేయాలి.
- తరువాత మీ ఫ్రోఫైల్ పై క్లిక్ చేసి వెంటనే ఆఫ్ లైన్ మ్యాప్స్ (Offline Maps) ఆప్షన్ ను ఎంచుకోవాలి.
- తరువాత సెలెక్ట్ యువర్ మ్యాప్ ( Select Your Map ) ఆప్షన్ ను ఎంచుకోవాలి. మీరు ఎక్కడికి వెళ్లాలి అనుకుంటున్నారో ఎంచుకోవాలి.
- తరువాత మీకు మ్యాప్ డౌన్ లోడ్ అవుతుంది. తరువాత మీరు నావిగేట్ చేస్తూ మీ గమ్యస్థానానికి చేరుకోవచ్చు.