Sugar Alternatives: షుగర్ కు 5 ఆరోగ్యకరమైన ప్రత్యామ్యాయాలు ఇవే

షుగర్ కు ఆరోగ్యకరమైన ప్రత్యమ్నాయాలు ఈ రోజుల్లో చాలా అవసరం. తీపి లేనిదే మన జీవితం పూర్తి కాదు. 

Last Updated : Sep 14, 2020, 05:22 PM IST
    • షుగర్ కు ఆరోగ్యకరమైన ప్రత్యమ్నాయాలు ఈ రోజుల్లో చాలా అవసరం. తీపి లేనిదే మన జీవితం పూర్తి కాదు.
    • అయిత ప్రతీ పదార్థంలో చెక్కర వాడటం అనేది ఆరోగ్యానికి అంత మంచిది కూడా కాదు.
    • ఇలాంటి పరిస్థితిలో వాటికి ప్రత్యామ్యాయాలు వాడటం అలవాటు చేసుకోవాలి. అలాంటి 5 ప్రత్యామ్నాయాలు ఏంటో తెలుసుకుందాం.
Sugar Alternatives: షుగర్ కు 5 ఆరోగ్యకరమైన ప్రత్యామ్యాయాలు ఇవే

షుగర్ కు ఆరోగ్యకరమైన ప్రత్యమ్నాయాలు ఈ రోజుల్లో చాలా అవసరం. తీపి లేనిదే మన జీవితం పూర్తి కాదు. అయిత ప్రతీ పదార్థంలో చెక్కర వాడటం అనేది ఆరోగ్యానికి  ( Health ) అంత మంచిది కూడా కాదు. ఇలాంటి పరిస్థితిలో వాటికి ప్రత్యామ్యాయాలు వాడటం అలవాటు చేసుకోవాలి. అలాంటి 5 ప్రత్యామ్నాయాలు ఏంటో తెలుసుకుందాం.

1. తెనె ( Honey)

చెక్కరకు మంచి ప్రత్యామ్నాయం తేనె. తెనెలో నాచురల్ గా తీయదనం ఉంటుంది. ఇందులో విటమిన్స్, మినరల్స్, ప్రొటీన్స్ కూడా ఉంటాయి. నీరు కూడా ఉంటుంది. తెనె రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. రక్తపోటు తగ్గుతుంది. దగ్గు, జలుబు నుంచి రక్షణ కలుగుతుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది.  

2.బెల్లం ( Jaggery )
బెల్లం లేదా జాగరీ అనేది మన దేశంలో అనాదిగా చెక్కరకు ప్రత్యామ్నాయంగా వాడుతున్న పదార్థం. మంచి రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా కలిగిస్తుంది. దీన్ని మెడికల్ షుగర్ అని కూడా అంటారు. అజీర్తి, దగ్గును వంటి సమస్యలను తగ్గిస్తుంది.

3. స్టీవియా ( Stevia )
స్టీవియాను తీయని ఆకు అని కూడా అంటారు. చెక్కరతో పోల్చితే ఇందులో 200 రెట్లు అదిక తీయదనం ఉంటుంది. మధుమేహం తో ఇబ్బంది పడుతున్న వారికి ఇది మంచి ప్రత్యామ్నాయం అవుతుంది. ఇందులో తక్కువ క్యాలరీస్ ఉండటం వల్ల సులువుగా బరువు తగ్గవచ్చు. దంతక్షయం కలగదు, కడుపులో యాసిడ్స్ తగ్గిస్తుంది, రక్తపోటును తగ్గిస్తుంది.

4. డ్రై ఫ్రూట్స్ ( Dry fruits )
ఏదైనా తీయది తినాలని ఉంటే మీరు డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఇందులో పోషకాలు మెండుగా ఉంటాయి. ఖర్జూరం, కిష్మిష్, అంజీరు, అలూ భుకార, బదాం వంటివి తీయదనంతో పాటు ఆరగ్యోనికి కూడా చాలా మంచివి.

5. పండ్లు (Fruits )
మామిడి, అరటిపండ్లు, క్యారట్లు, పపాయ, యాపిల్, పుచ్చకాయ వంటి పండ్లు తీయగా ఏదైనా తినాలి అనుకునే వారికి మంచి ప్రత్యామ్నాయం అవుతాయి. వీటి వల్ల అనేక ఆరోగ్యకరమైన లాభాలు కూడా ఉంటాయి.

Trending News