Red spitting King Cobra: మీకు తెలుసా.. రెడ్ కింగ్ కోబ్రా కాటువేయకుండానే ఉమ్మేసే వేటాడుతుందని..?
Viral Video, Deadly Red King Cobra spitting venom. అరుదైన జాతికి చెందిన రెడ్ కింగ్ కోబ్రా విషంను బయటికి కక్కుతుంటుంది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Deadly Red King Cobra spitting venom: కింగ్ కోబ్రా, శ్వేతనాగు, అనకొండ లాంటి పాములను మనం తరచుగా చూస్తూనే ఉంటాం. ప్రత్యక్షంగా చూడకున్నా.. సినిమాల్లో అయినా ప్రతి ఒక్కరు చూసుంటారు. అయితే 'రెడ్ కింగ్ కోబ్రా' కూడా ఉంటుందని చాలా మందికి తెలియదు. చాలామంది సినిమాల్లో కూడా 'రెడ్ కింగ్ కోబ్రా'ను ఎప్పుడూ చూసుండరు. అంతెందుకు ఈ పేరు ఇప్పటివరకు వినని వారు కూడా ఉన్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తాజాగా ఇందుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.
అరుదైన జాతికి చెందిన రెడ్ కింగ్ కోబ్రా.. ఈజిప్టు, టాంజానియాలో ఎక్కువగా సంచరిస్తాయట. రెడ్ కింగ్ కోబ్రా ఎక్కువ పొడవు ఉండదు. మాములుగా త్రాచుపాములు ఉండే పొడవులో ఉంటాయి. 1.2 మీటర్ల పొడవులో ఈ కోబ్రాలు ఉంటాయి. మిగతా పాములలా కాకుండా ఈ రెడ్ కింగ్ కోబ్రా విషంను బయటికి కక్కుతుంటుంది (ఉమ్మి వేస్తుంటుంది). చాలా వేగంగా విషంను బయటకు ఉమ్మి వేస్తుంది. ఈ విషం చాలా విషపూరితమైందట.
రెడ్ కింగ్ కోబ్రా విషాన్ని ఉమ్మివేయడం వల్ల.. పామును వేటాడే జంతువులు దూరంగా ఉంటాయట. రెడ్ కింగ్ కోబ్రాలు ఎక్కువుగా ఎలుకలను వేటాడుతాయి. ఎలుకలతో పాటుగా చిన్న చిన్న సకశేరుకాలను వేటాడి తింటాయి. ఇక ఈ రెడ్ కింగ్ కోబ్రా విషాన్ని కక్కే వీడియోను 'Living Zoology' అనే యూట్యూబ్ ఛానెల్ పోస్ట్ చేసింది. ఈ వీడియోని 2020లో పోస్ట్ చేసినా.. ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. వీడియో చూసిన అందరూ షాక్ అవుతున్నారు.
Also Read: దురద పెడుతుంటే.. 15 అడుగుల కింగ్ కోబ్రాతో గోక్కున్నాడు! నమ్మకుంటే వీడియో చూడండి
Also Read: నేహా మాలిక్ గ్లామర్ ట్రీట్.. సాగరతీరాన బికినీ అందాలతో కనువిందు చేస్తున్న హాట్ బ్యూటీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook