River in Thar | థార్ ఎడారి ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ఎడారి. అయితే ఇక్కడ ఒకప్పుడు జీవనది ప్రవాహించేదట. ప్రతీ ఎడారి ( Desert ) ఒక నది ఉంటుంది అని పరిశోధకులు అంటుంటారు. అలాంటి ఒక పరిశోధనా సంస్థ తరపున కొంత మంది రీసెర్చర్స్ థార్ లో అంతరించిన నది గురించి కనుక్కోవడానికి ప్రయత్నించి విజయం సాధించారు. సుమారు లక్షా 626 సంవత్సరాల క్రితం అంటే రాతి యుగంలో ( Stone Age ) అంతరించిందట. Also Read | Wierd News: పెళ్లికూతురు వద్దంది అని.. తనను తానే పెళ్లి చేసుకున్నాడు…


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


రాజస్థాన్ లోని ( Rajasthan ) ఎడారిలో నది ప్రవాహించేది అని పరిశోధకులు తెలిపారు. అయితే పరిశోధకులు వెల్లడించిన తాజా సమాచారం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.


ఈ పరిశోధనను మ్యాక్స్ ప్లాంక్స్ ఇనిస్టిట్యూడ్ ఫర్ ది సైన్స్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ అనే జర్మనీ సంస్థ, తమిళనాడులోని (Tamilnadu ) అన్నా యూనివర్సిటీ,  కోల్ కత్తాలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ( IISER ) సంయుక్తంగా నిర్వహించింది. రాతియుగంలో థార్ ఎడారిలోని కొన్ని ప్రాంతాల్లో నది ప్రవాహం ఉండేది అని కనుగొన్నారు. Also Read | Zero Corona: కెనడాలోని ఈ ప్రాంతంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు


బికేన్ లోని నాల్ క్వారీ ప్రాంతాల్లో ఈ ప్రవాహం ఉండేది అని తెలిపారు. ఈ నది ప్రస్తుతం బికేనేర్ నుంచి సుమారు 200 కిలోమీటర్లలో ప్రవాహించేది అని తెలిపారు. అప్పట్లో ఇంత పెద్ద ఎడారి ఉండేది కాదట. మంచి పంట పొలాలు ఉండేవట. కొంత మంది ఆఫ్రికన్ ప్రజలు అక్కడ సెటిల్ అయ్యారు అని.. తరువాత వారు ప్రపంచం మొత్తం విస్తరించారని తెలిపారు. Also Read | Winter Foods For Dry Skin: చలికాలం చర్మం పొడిబారకుండా ఉండాలంటే పాటించాల్సిన డైట్



అంతరిక్షం నుంచి తీసిన చిత్రాలన పరిశోధకులు షేర్ చేశారు. వాటిని పరిశోధించిన తరువాత నది ప్రవాహించే మార్గాన్ని కనుగొన్నారు. తరువాత ఆ ప్రాంతానికి వెళ్లి రీసెర్చ్ కొనసాగించారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇక్కడ నది ప్రవాహించేది అని తరువాత అది మెల్లిగా ఎండటం ప్రారంభించింది అని తెలిపారు. 



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR