RGV on Dogs Attacking Boy: రాంగోపాల్ వర్మ మరోసారి హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మిని ట్యాగ్ చేస్తూ ట్విటర్‌లో మరో వీడియోను పోస్ట్ చేశారు. ఈసారి ఒక నాలుగైదేళ్ల వయస్సున్న బాలుడిని వీధి కుక్కలు చుట్టుముట్టి కరిచిన ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాన్ని రాంగోపాల్ వర్మ ట్విటర్ ద్వారా షేర్ చేశారు. ఈ ఘటనపై ఒకసారి ఫోకస్ చేయమని ఇండైరెక్టుగా సూచిస్తూ మేయర్ గద్వాల విజయ లక్ష్మిని ట్యాగ్ చేశారు. రాంగోపాల్ వర్మ పోస్ట్ చేసిన వీడియో చూస్తే చాలా దారుణంగా ఉంది. చిన్న పిల్లాడిని చుట్టుముట్టిన వీధి కుక్కలు ఆ పిల్లాడిపై నాలుగువైపుల నుంచి దాడి చేస్తున్న వైనం ఒళ్లు గగుర్పొడిచేదిగా ఉంది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


అయితే, ఈ వీడియోలో దాగి ఉన్న అసలు ట్విస్ట్ వేరే ఉంది. వీడియో చూసిన నెటిజెన్స్‌లో కొంతమంది స్పందిస్తూ.. ఇది నాగపూర్‌లో జరిగిన ఘటన అని చెబుతూ అందుకు సంబంధించిన న్యూస్ లింక్ షేర్ చేశారు. హైదరాబాద్‌తో సంబంధం లేని ఘటన విషయంలో హైదరాబాద్ మేయర్ చేయగలిగింది ఏముంది అంటూ నెటిజెన్స్ వర్మను ప్రశ్నిస్తున్నారు. 



 


 



 


 



 


 



 


 



 


రాంగోపాల్ వర్మ ఈ వీడియోను పోస్ట్ చేస్తూ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మికి ట్యాగ్ చేయడానికి కారణం లేకపోలేదు. ఒక నెల రోజుల క్రితం హైదరాబాద్‌లో నాలుగేళ్ల బాలుడిపై కుక్కలు దాడి చేసి ఆ బాలుడి మృతికి కారణమైన ఘటన అప్పట్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నగరంలో అడుగడుగునా దర్శనం ఇస్తోన్న వీధి కుక్కలతో ఇలాంటి సమస్య నగరం అంతటా నెలకొని ఉందని అప్పట్లో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అయితే, అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ ఘటనపై హైదరాబాద్ మేయర్ గద్వాల విజయ లక్ష్మీ చేసిన వ్యాఖ్యలను రాంగోపాల్ వర్మ తీవ్రంగా పరిగణిస్తూ ఘాటుగా స్పందించిన విషయం కూడా తెలిసిందే. 


ఇది కూడా చదవండి : Bear Vs Man Video: ఎలుగుబంటి దాడి నుంచి తప్పించుకునేందుకు చెట్టు ఎక్కబోయాడు.. కానీ అంతలోనే


మేయర్ విజయ లక్ష్మి ఇంట్లోకి ఓ 5 వేల కుక్కల్ని పంపించి అన్నివైపుల నుంచి గేట్లు మూసేస్తే ఆ సమస్య ఏంటో ఆమెకు అప్పుడు తెలిసొస్తుంది అంటూ అప్పట్లో కామన్ మ్యాన్ తరపున రాంగోపాల్ వర్మ చేసిన విమర్శలు ఎంత వైరల్ అయ్యాయో తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోను వర్మ ట్విటర్‌లో పోస్ట్ చేసి మేయర్‌కి ట్యాగ్ చేశారు. ఇక రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ కి మేయర్ గద్వాల విజయలక్ష్మి ఏమని రిప్లై ఇవ్వనున్నారు, మళ్లీ ఆ రిప్లైకి వర్మ ఎలా స్పందిస్తారు అనేదే ప్రస్తుతానికి ఆసక్తికరంగా మారింది.


ఇది కూడా చదవండి : Real Fighting Scene: తన గాళ్ ఫ్రెండ్ జోలికి వచ్చిన ఇద్దరిని ఒక్కడే చితక్కొట్టాడు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK