Crowdfunding For Road Widening In Kerala: గ్రామస్తులంతా ఒక్కటయ్యారు.. రుచికరమైన బిర్యానీ, స్వీట్లతో కూడిన విందూ భోజనాలు సిద్ధమయ్యాయి. బాజభజంత్రీలు వచ్చేశాయి. ఇంక కానియ్యండి కానియ్యండి అంటూ పెళ్లి చేశారు. అయితే ఆ పెళ్లి చేసింది మనుషులకు కాదు.. జంతువులకూ కూడా కాదు. పెళ్లి జరిగింది రోడ్డుకు. రోడ్డుకు పెళ్లి చేయడం వైరల్‌గా మారింది. కేరళలోని ఓ గ్రామస్తులు ఈ పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపారు. ఈ పెళ్లి వెనుక ఒక సదుద్దేశం ఉంది. పెళ్లి ఏమిటి? ఆ కథ ఏమిటనేది చదవుదాం పదండి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Floating Bridge: లేదు లేదు 'తేలియాడే వంతెన' కొట్టుకుపోలే.. మేమే దాన్ని విడదీశాం


కేరళలోని కోజికోడ్‌ జిల్లా కొడియాత్తూరు గ్రామంలో రోడ్డు సమస్య తీవ్రంగా ఉంది. 1,200 మీటర్ల పొడవు, మూడున్నర మీటర్ల వెడల్పు ఉన్న ఈ రోడ్డును 1980 కాలంలో నిర్మించారు. అప్పటి గ్రామ జనాభాకు తగ్గట్టు నాడు రోడ్డు నిర్మించగా.. ఇప్పుడు గ్రామం పెద్దది కావడంతో రోడ్డు ఇరుకుగా మారింది. ప్రస్తుతం గ్రామంలో జనాభా మూడు రెట్లు పెరగడంతో ఆ రోడ్డు చిన్నగా మారి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోడ్డు విస్తరణకు చాలా ఆటంకాలు ఏర్పడ్డాయి. రోడ్డు విస్తరణ కోసం అనేక ప్రయత్నాలు చేసినా ఫలించలేదు.  రోడ్డు విస్తరించాలంటే కొన్ని కుటుంబాలు ఇళ్లను కోల్పోవాల్సి వచ్చింది. ఏం చేయాలో అని గ్రామస్తులంతా మదనపడ్డారు. గ్రామస్తులంతా కలిసి ఓ నిర్ణయానికి వచ్చారు. 'కొడియాత్తూరు వికాస సమితి' అనే పేరిట ఓ సంఘాన్ని స్థాపించారు.

Also Read: Anchor Kidnap: కిడ్నాప్‌ కేసులో భారీ ట్విస్ట్‌.. 'జరిగింది ఇది' అంటూ యాంకర్‌ లేఖ విడుదల


అనంతరం రోడ్డు విస్తరిస్తే భూమి కోల్పోయే వారికి పరిహారం, రోడ్డు నిర్మాణంపై ఖర్చు అంచనా వేశారు. మొత్తం రూ.60 లక్షలు ఖర్చవుతుందని ఒక లెక్క వేశారు. విరాళాలు ఆహ్వానించగా గ్రామానికి చెందిన 15 మంది ఒక్కొక్కరు రూ.లక్ష చొప్పున రూ.15 లక్షలు విరాళం అందించారు. మిగిలిన రూ.45 లక్షల కోసం ప్రయత్నించారు. అప్పుడే వారికి గత సంప్రదాయం గుర్తుకు వచ్చింది. 'పనం పయట్టు', 'కురి కల్యాణం' అనే వ్యవస్థ ఆలోచన తట్టింది. కురి కల్యాణం అంటే ఉత్తర కేరళలో ఒక దేశీయ ఆర్థిక సహకార వ్యవస్థగా ఉండేది. శతాబ్దాల కిందట కురి కల్యాణం ద్వారా పరస్పరం సహకరించుకుని ఆర్థిక తోడ్పాటు అందించుకునేవారు. అందరూ కలిసి సామాజిక కార్యక్రమాలకు సహకరించేవారు.


ఇప్పుడు రోడ్డు అభివృద్ధికి కూడా 'కురి కల్యాణం' నిర్వహించాలని చెప్పి నిర్ణయించారు. ఫిబ్రవరి 25 (ఆదివారం) మంచి ముహూర్తం ఉండడంతో గ్రామస్తులంతా రోడ్డుకు పెళ్లి జరిపించారు. పెళ్లి అంటే ఏమీ లేదు. గ్రామ ప్రజలంతా కలిసి సామూహిక భోజనాలు చేసి చదివింపులు చేస్తారు. భోజనాలు చేసిన వారంతా వారికి తోచినంతా సహాయం చేస్తారు. ఈ వేడుకకు గ్రామస్తులే కాదు ఇతర ప్రాంత ప్రజలు కూడా తరలివచ్చారు. గ్రామస్తుల ఐక్యత చూసి మరికొన్ని గ్రామాలు కూడా స్ఫూర్తి పొందాయి. ఈ పెళ్లి ద్వారా వచ్చిన డబ్బుతో రోడ్డు పనులు చేపట్టనున్నారు. అయితే ఎంత ఆదాయం వచ్చిందో ఇంకా తెలియలేదు. కొడియాత్తూరు గ్రామస్తులు చేసిన పనులు ఇతర ప్రాంతాలకు కూడా ఆదర్శంగా నిలిచాయి. కనుమరుగైన 'కురి కల్యాణం', 'పనం పయట్టు' సంప్రదాయాన్ని మరోసారి తెరపైకి తెచ్చి భావితరాలకు అందించారు. ఈ సంప్రదాయం కొనసాగిస్తే ఆపదలో ఉన్నవారికి ఆదుకునేందుకు ఎంతో దోహదం చేసే అవకాశం ఉంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి