Anchor Kidnap: కిడ్నాప్‌ కేసులో భారీ ట్విస్ట్‌.. 'జరిగింది ఇది' అంటూ యాంకర్‌ లేఖ విడుదల

TV Anchor Pranav Sistla Letter: తనను కిడ్నాప్‌ చేసిన ఉదంతంపై యాంకర్‌ జరిగిన మొత్తం వ్యవహారం పంచుకున్నాడు. తనపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని కొట్టివేస్తూనే.. ఈ ఘటనతో సైబర్‌ నేరాలు ఎలా జరుగుతున్నాయో తెలియవచ్చిందని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ఓ లేఖ విడుదల చేశాడు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 26, 2024, 09:37 PM IST
Anchor Kidnap: కిడ్నాప్‌ కేసులో భారీ ట్విస్ట్‌.. 'జరిగింది ఇది' అంటూ యాంకర్‌ లేఖ విడుదల

TV Anchor Kidnap Case: తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం సృష్టించిన యాంకర్‌ కిడ్నాప్‌ కేసులో మరో భారీ ట్విస్ట్‌ చోటుచేసుకుంది. కిడ్నాప్‌ కేసు విషయమై రకరకాల వార్తలు, కథనాలు వస్తున్న నేపథ్యంలో యాంకర్‌ స్వయంగా జరిగింది ఇది' అంటూ ఓ లేఖ విడుదల చేశారు. జరిగిన విషయాన్నంతా వివరించాడు. ఈ కేసు విషయంలో తాను ఎవరినీ కలవని.. పోలీసులు వారి పని వారు చేసుకునేందుకు సహకరిస్తానని ప్రకటించాడు. ఈ సందర్భంగా మూడు పేజీల లేఖను తన సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేశాడు.

Also Read: Farmer: 'మెట్రో'లో రైతుకు ఘోర అవమానం.. 'మురికి బట్టలు' ఉన్నాయని రైలు ఎక్కనివ్వని సిబ్బంది

'నేను బాధితుడిగా 48 గంటల నుంచి అన్ని ప్రధాన మీడియాలో కథనాలు వస్తున్నాయి. నేను కూడా వాటిని చూశా. కొన్నింటిలో అసత్య కథనాలు ప్రసారమవుతున్నాయి. ఏం జరిగిందనేది నేను ఒక స్పష్టత ఇవ్వాలని భావిస్తున్నా. ఈ ఘటనపై నాకు ఫోన్లు, సందేశాల ద్వారా సంఘీభావం తెలిపిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు. బయట జరుగుతున్న ప్రచారాన్ని నేను పట్టించుకోను. నేను పోలీసులను ప్రగాఢంగా నమ్ముతున్నా. ఉప్పల్‌ పోలీస్‌ అధికారులు నిజాయతీగా పని చేస్తున్నారు. నా నుంచి అన్ని ఆధారాలు తీసుకుని విచారణ చేపడుతున్నారు' అని తెలిపాడు.

Also Read: KTR Gifts: విద్యార్థులకు కేటీఆర్‌ 'అమూల్యమైన కానుక'.. చిన్నదే అయినా ఎంతో ప్రత్యేకం

తనకు జరిగిన సంఘటనతో సైబర్‌ నేరాలు ఎలా జరుగుతున్నాయో తెలివచ్చిందని పేర్కొన్నాడు. హైదరాబాద్‌ మహానగరంలో తనకు ఇలాంటి ఘటన జరగడంపై విస్మయం వ్యక్తం చేశాడు. ఇలాంటి సంఘటనతో తనకు భయం, బాధాకరంగా అనిపించిందని లేఖలో పేర్కొన్నాడు. 'ఈ ఘటనతో అకారణంగా నేను మానసికంగా, శారీరకంగా గాయపడ్డా. అసలు ఏం జరిగిందనేది కొన్ని వాస్తవాలు వెల్లడించాలని భావిస్తున్నా' అని చెప్పి కొన్ని పాయింట్ల వారీగా ప్రణవ్‌ చెప్పుకొచ్చాడు. 

- 11 ఫిబ్రవరి 2024 తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో ఉప్పల్‌లో నేను కిడ్నాప్‌కు గురయ్యా. అదే రోజులు ఉదయం 7.30 సమయంలో కిడ్నాప్‌ నుంచి బయటపడ్డా.
- ఈ కిడ్నాప్‌ వ్యవహారంలో ఆమెతో సహా మొత్తం ఐదుగురు పాత్ర ఉంది.
- నాపై నిఘా వేసేందుకు నా కారు కింద ట్రేసింగ్‌కు ఓ పరికరం ఏర్పాటుచేశారు.
- అపరిచితులు నా ఇన్‌స్టాగ్రామ్‌ ఫొటోలు ఉపయోగించుకుని మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో నకిలీ ఖాతాలు సృష్టించారు. నా ఫొటోతో వేరే పేర్లు పెట్టుకుని తప్పుదారి పట్టిస్తున్నారు.
- ఆమె (నిందితురాలు గోగిరెడ్డి తృష్ణ) ఎవరో నాకు తెలియదు. గతంలో ఎప్పుడూ చూడలేదు. ఫోన్‌లో మాట్లాడలేదు.
- గతేడాది సెప్టెంబర్‌లో ఆమె నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో సంప్రదించింది. జరిగిన విషయాన్నంతా నాకు చెప్పగానే వెంటనే సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించా.
- నా ఫొటోలు ఉపయోగించుకుని నకిలీ ఖాతాలు సృష్టిస్తున్న విషయాన్ని 2021 నుంచి అందరినీ హెచ్చరిస్తున్నా.

'ఏది ఏమైనా జరిగిన పరిణామాలు సంతోషం. ఈ పరిణామంలో నాపై ఎవరూ జాలి చూపించాల్సిన అవసరం లేదు. ఈ సంఘటనతో సైబర్‌ నేరాలు ఎలా జరుగుతున్నాయో ప్రపంచానికి తెలియవచ్చింది. ఎవరూ కూడా సైబర్‌ నేరాల బారినపడవద్దు. ఉద్యోగాలు, రుణాలు, లాటరీ, అతి ముఖ్యంగా మ్యాట్రిమోనీ వంటి మోసాల బారిన చిక్కుకోవద్దు' అంటూ ప్రణవ్‌ సిస్ట్లా సలహాలు ఇచ్చాడు.
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News