Security For Mango: వేసవి కాలం రానే వచ్చింది. మార్చి మొదటి వారం నుంచే ఎండలు మండిపోతున్నాయి. కానీ, ఎండల కాలంలో మనకు నచ్చే ఒకేఒక్క అంశం మామిడి పండు. ఇది వేసవిలో మాత్రమే పండుతుంది. పండ్లలో రారాజు అయిన మామిడి పండు అంటే చాలా మంది ఇష్టంగా తింటుంటారు. వేసవిలో మామిడి పండును తినని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో! ఇప్పుడిప్పుడే మామిడు పండ్ల మార్కెట్లోకి వస్తున్నాయి. అయితే ఈ క్రమంలో ఓ రైతు తాను పండించిన ఒక మామిడి పండుకు జడ్ ప్లస్ కేటగిరి పెట్టాడు. అయితే దాని వెనుక ఉన్న కారణం ఏంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మామిడి పండుకు జెడ్ ప్లస్ భద్రత


భారతదేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మామిడి పండ్లను పండిస్తున్నారు. కొందరు తమ ఇంటి ఆవరణలో మామిడి చెట్లను పెంచుతున్నారు. వేసవిలో వాటి నుంచి వచ్చే రుచికరమైన మామిడి పండ్లను పొందుతున్నారు. అయితే వారు ఎంతో ప్రేమగా పెంచిన చెట్ల నుంచి వచ్చిన మామిడి పండ్లను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. కానీ, ఓ వ్యక్తి మాత్రం తన ఇంట్లోని మామిడి చెట్టుకు కాసిన ఒకే ఒక మామిడి పండుకు ఏకంగా జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ పెట్టాడు. 



ఒక్క మామిడి పండుకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఏంటని అనుకుంటున్నారా? అవును, మీరు విన్నది నిజమే! ఓ వ్యక్తి తన ఇంట్లో చెట్టుకు కాసిన ఒక్కే ఒక్క మామిడి పండుకు జడ్ ప్లస్ కేటగిరీ ఉంది. అయితే అది మనుషులు కాదండోయ్. దాని కోసేందుకు ఎవరూ ధైర్యం చేసి రాళ్లు కూడా విసరలేరు. ఎందుకంటే ఆ మామిడి పండుకు చుట్టూ తేనెటీగలు ఉన్నాయి. దీంతో ఆ పండు జోలి వెళ్లేందుకు కూడా ఎవరూ సాహసించడం లేదు. అందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది.  


Also Read: Complaint for Mutton Curry: మటన్ కర్రీ వండలేదని భార్యపై పోలీసులకు ఫిర్యాదు.. ఆ వెంటనే అరెస్టు!


Also Read: Giant snake video: పెద్ద పాము తోక పట్టుకొని ఆడుకుంటున్న చిన్న పాప.. వీడియో వైరల్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook