Lightning Strike Video: షాకింగ్ వైరల్ వీడియో, ఫుట్‌బాల్ ఆడుతుండగా పిడుగుపడి ఒకరి మృతి
Lightning Strike Video: లాటిన్ అమెరికా నుంచి వచ్చిన ఈ వీడియో ఒళ్లు గగుర్పాటు కల్గిస్తోంది. అందరూ చూస్తుండగా, ఫుట్‌బాల్ ఆడుతున్న ఆటగాళ్లపై పిడుగు పడిన ఘటన ఇది. లైవ్‌లో రికార్డ్ అయిన ఈ దృశ్యం షాకింగ్‌గా మారింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Lightning Strike Video: వర్షం పడేటప్పుడు, మెరుపులు మెరిసేటప్పుడు వాతావరణ శాఖ కొన్ని హెచ్చరికలు పంపిస్తుంటుంది. బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని, చెట్లు, టవర్ల కింద నిలబడకూడదని పదే పదే విజ్ఞప్తులు చేస్తుంటుంది. అయినా చాలామంది పట్టించుకోరు. పర్యవసానం ఈ వీడియో.
పిడుగులు పటేటప్పుడు ముఖ్యంగా మెరుపులతో వర్షం పడుతున్నప్పుడు చెరువులు, పొలాలు, బహిరంగ ప్రదేశాల్లోనూ, చెట్లు, టవర్ల కింద ఉండకూడదని ప్రతి దేశంలోనూ వాతావరణ శాఖ అలర్ట్ మెస్సేజ్ పంపిస్తుంటుంది. వాస్తవానికి ఇలాంటి సందేశాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. ఏమాత్రం చేసినా ఇదిగా లాటిన్ అమెరికా దేశం పెరూలో జరిగినట్టే జరుగుతుంది. పెరూలోని హువాన్కాయోలో ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతోంది. మధ్యలో వర్షం పడటంతో మ్యాచ్ నిలిపేశారు. ఆటగాళ్లు ఒక్కొక్కరిగా నెమ్మదిగా గ్రౌండ్ నుంచి బయటకు వెళ్తున్నారు. అంతలో ఒక్కసారిగా పిడుగుపడింది. దాదాపు కొంతమంది కుప్పకూలిపోయారు. ఒకరు అక్కడికక్కడే మరణించగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ఇదంతా లైవ్ వీడియోలో స్పష్టంగా రికార్డయింది. ఇదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గాయపడినవారిలో రిఫరీ కూడా ఉన్నాడు. ఓ ఆటగాడిపై నేరుగా పిడుగు పడటంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ వీడియోను ఏపీ విపత్తుల శాఖ సోషల్ మీడియా ఎక్కౌంట్ ద్వారా షేర్ చేసింది. అందరినీ అలర్ట్ చేస్తోంది.
Also read: Pawan Kalyan Delhi Tour: పవన్ కళ్యాణ్ ఆకశ్మిక ఢిల్లీ పర్యటన వెనుక కారణమేంటి, ఏం జరుగుతోంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.