Taj Mahal: మొన్న నీరు లీకేజీ, నేడు పిచ్చిమొక్కలు.. ప్రమాదపుటంచున తాజ్ మహల్
Taj Mahal Going To Dangerous Water Leakage Now Plant Grow: ప్రేమికుల నిలయమైన తాజ్‌మహల్ ప్రతిష్ట దిగజారుతోంది. మొన్న నీటి లీకేజ్ కాగా.. నేడు పిచ్చిమొక్కలు దర్శనమివ్వడంతో మహల్ ప్రమాదకరంగా మారింది.
Taj Mahal Plants: ప్రపంచ వింతల్లో ఒక్కటైన.. ప్రేమకు నిలయమైన తాజ్ మహల్ ప్రమాదకరంగా మారింది. వారం రోజుల వ్యవధిలో ఆ నిర్మాణం దెబ్బతింటోంటి. మొన్న ఆ భవనం నుంచి నీరు లీక్ కాగా.. తాజాగా పిచ్చిమొక్కలు మొలిచాయి. దీంతో నిర్మాణంలో పెచ్చులు ఊడుతున్నాయి. దీంతో పర్యాటకులు, ప్రేమికులు ఆందోళన చెందుతున్నాయి. సుందరమైన శ్వేత నిర్మాణం నిర్లక్ష్యానికి గురవడంతో అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజ్ మహల్‌కు మొక్కలు మొలిచిన వార్తలు వైరల్‌గా మారాయి.
Also Read: Revanth Grandson: నిమజ్జనంలో మనుమడి స్టెప్పులు.. మురిసిపోయిన రేవంత్ రెడ్డి తాత
ఢిల్లీకి సమీపంలో ఆగ్రా నగరంలో యమునా నది ఒడ్డున ప్రపంచ ప్రఖ్యాతి పొందిన తాజ్ మహల్ ఉన్న విషయం తెలిసిందే. శతాబ్దాల ఘన చరిత్ర కలిగిన ఈ నిర్మాణం ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంటోంది. తాజాగా మహల్ ప్రధాన గోపురం (డూమ్)పై పిచ్చిమొక్కలు మొలిశాయి. ఆ మొక్కలకు సంబంధించిన వీడియో, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నారు. చారిత్రక నిర్మాణాన్ని పరిరరక్షించడంతో ప్రభుత్వం విఫలమవుతోందనే విమర్శలు వస్తున్నాయి. మొత్తం పాలరాతితో నిర్మించిన ఈ సుందర నిర్మాణం రోజురోజుకు మసకబారుతోంది.
Also Read: Python Viral: ఏసీబీ ఆఫీస్‌లో భారీ కొండచిలువ హల్‌చల్.. బెంబేలెత్తి పడిపోయిన సిబ్బంది
ఇప్పటికే కాలుష్యంతో తాజ్ మహల్ సహజ రంగును కోల్పోతుండడంతో పర్యాటకులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల నీటి లీకేజ్ సమస్య కూడా ఏర్పడింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తాజ్ మహల్ ప్రధాన డూమ్‌లోంచి నీరు లీకయ్యింది. ఈ సంఘటన మరువకముందే పిచ్చిమొక్కలు పెరిగాయి. ఈ పరిణామం అందరినీ ఆందోళన కలిగించగా.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా పరిరక్షించాల్సిన పురావస్తు శాఖ ఏం చేస్తుందని పర్యాటకులు నిలదీస్తున్నారు.
వరుస ఘటనలపై తీవ్ర విమర్శలు రావడంతో పురావస్తు శాస్త్రవేత్త, పర్యవేక్షకుడు డాక్టర్ రాజ్ కుమార్ పటేల్ స్పందించారు. 'ప్రతి శుక్రవారం మేం తాజ్ మహల్ గోడలను శుభ్రం చేసి పిచ్చిమొక్కలను తొలగిస్తుంటాం. మొక్కలు పెరిగిన ప్రాంతం చాలా ఎత్తులో ఉంది. ఆ విషయం మా దృష్టికి రాలేదు. ఆ మొక్కలను తొలగిస్తాం' అని తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.