Revanth Grandson: నిమజ్జనంలో మనుమడి స్టెప్పులు.. మురిసిపోయిన రేవంత్‌ రెడ్డి తాత

Revanth Reddy Grandson Reyansh Reddy Dance Steps Viral: తన నివాసం వద్ద జరిగిన గణేశ్ నిమజ్జనంలో రేవంత్‌ రెడ్డి మనుమడు సందడి చేశాడు. డప్పు చప్పుళ్లకు అనుగుణంగా డ్యాన్స్‌ చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Sep 17, 2024, 10:43 AM IST
Revanth Grandson: నిమజ్జనంలో మనుమడి స్టెప్పులు.. మురిసిపోయిన రేవంత్‌ రెడ్డి తాత

Revanth Reddy Grandson Dance: తెలుగు రాష్ట్రాల్లో 11 రోజుల పాటు పూజలందుకున్న వినాయకుడు నిమజ్జనానికి తరలివెళ్తున్నాడు. ముఖ్యంగా తెలంగాణలో కన్నుల పండువగా గణనాథుడి శోభయాత్ర కొనసాగుతోంది. భక్తులు తమ ఇష్ట దైవం గణేశుడిని ఆనందోత్సాహాల మధ్య గంగమ్మ ఒడికి చేరుస్తున్నాడు. దీంతో ఎటు చూసినా కోలాహలం ఏర్పడింది. ఈ క్రమంలోనే తమ నివాసంలో జరిగిన నిమజ్జన ఉత్సవంలో రేవంత్‌ రెడ్డి మనుమడు రేయాన్ష్‌ రెడ్డి సందడి చేశాడు. తీన్మార్‌ స్టెప్పులతో ఆకట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Also Read: Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం షెడ్యూల్‌ ఇదే! గంగలో కలిసేది ఈ సమయానికే

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి నివాసంలో వినాయకుడిని ప్రతిష్టించారు. నవరాత్రులు ఘనంగా పూజలు చేసిన రేవంత్‌ కుటుంబసభ్యులు మంగళవారం గణనాథుడిని నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా ఊరేగింపులో రేవంత్‌ కుటుంబసభ్యులు సందడి చేశారు. రేవంత్ రెడ్డి, ఆయన భార్య, కూతురు, అల్లుడితో సహా పెద్ద ఎత్తున బంధుమిత్రులు హాజరయ్యారు. అయితే నిమజ్జనం సందర్భంగా మనుమడు రేయాన్ష్‌ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

Also Read: Balapur Laddu: బాలాపూర్‌ లడ్డూ గెలిస్తే కొంగు బంగారమే! వేలం విజేతల జాబితా ఇదే!

బ్యాండ్ చప్పుళ్లకు అనుగుణంగా రేయాన్ష్‌ రెడ్డి డ్యాన్స్ చేశాడు. డప్పు చప్పుళ్లకు అనుగుణంగా స్టెప్పులు వేయడం అందరినీ ఆకట్టుకుంది. మనుమడి స్టెప్పులు చూస్తూ తాత రేవంత్ మురిసిపోయారు. సీఎం సతీమణి, కూతురు చప్పట్లు కొడుతూ రేయాన్ష్‌ను ఉత్సాహపరిచారు. డ్యాన్స్‌ చేయమని చెప్పు అంటూ తన భార్యకు చెబుతూ రేవంత్‌ తన మనుమడిని ప్రోత్సహించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఎంతో ముద్దుగా స్టెప్పులు వేస్తున్న వీడియో ఆకట్టుకుంటోంది. నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News