Shocking Viral Video: సోషల్ మీడియాలో (Social Media) ఎల్లపుడు ఏదోక వీడియో లేదా ఫోటోలు వైరల్ అవుతూనే ఉంటాయి. కొన్ని వీడియోలో ఫన్నీగా ఉంటే మరికొన్ని వీడియోలు భయానకంగా ఉంటే మరి కొన్ని షాక్ కు గురి చేస్తాయి. యధావిదిగానే ఈ రోజు కూడా సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియో చూసి కొంత మంది భయానికి గురవుతుంటే.. మరి కొందరు ఫన్నీగా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. ఆ వీడియో ఏంటో ఇపుడు చూద్దామా..??


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ఇందులో ఒక యువతి పండ్లు ఉన్న డబ్బాను చేతిలో పట్టుకొని ఇంటి ముందు ఉన్న తన కారు దగ్గరకి వెళ్తుంది. కాకపొతే అప్పటికే ఆ కారు డోర్ తీసి ఉంటుంది. అది గమనించి ఎవరో కుర్చున్నారో అన్న అభిప్రాయంతో వెళ్లి చూసింది.. 


Also Read: Memes on Raj Kundra Bail: శిల్పా శెట్టి-రాజ్ కుంద్రా మీమ్స్.. ఓ రేంజ్ లో ఆడుకుంటున్న నెటిజన్లు


అంతే... ఇంకేం ఉంది కారులో ఉన్న దాన్ని చూడగానే కాళ్లు, చేతులు వనకటం... ఏం చేయాలో అర్థం కాక తికమక పడిపోయింది ఆ యువతి. ఇంతకీ కార్లో ఏం కుర్చిందంటే.. "ఒక పెద్ద ఎలుగుబంటి" (Bear). ఆ నిమిషంలో ఆ యువతికే కాదు ఎవరికీ అయిన మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. కానీ ఆ యువతి సమయస్పూర్తితో త్వరగా డోర్ మూయటానికి ప్రయత్నించింది. 


ఆ అమ్మాయి అరుపులతో కంగారు పడ్డ ఎలుగు బంటి కూడా కార్లోంచి బయటకు రావటానికి ప్రయత్నించింది. ఆ క్రమంలో యువతి పండ్లు ఉన్న డబ్బాను విసిరేసి త్వరగా ఇంట్లోకి పరిగెత్తింది. భయపడ్డ ఎలుగుబంటి కార్లోంచి భయటకి వచ్చి అటు ఇటు కాసేపు తిరిగి మళ్లీ అడవిలోకి వెళ్లిపోయింది. 




Also Read: Kerala: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ఆటో డ్రైవర్..! ఎలాగో తెలుసా?


ఇదంతా సీసీ టీవీ కెమెరాలో రికార్డు అవ్వటం, ఒక యూసర్ దీనిని ట్విట్టర్ లో పోస్ట్ చేయటం.. అది వైరల్ గా మారటం క్షణాల్లో జరిగిపోయింది. ఇప్పటి వరకి ఈ వీడియోకి వేలాది కామెంట్స్ రాగా, లక్షల్లో పైగా లైక్స్ మరియు 44 లక్షల మందికిపైగా ఈ వీడియో చూసారు. మీరు కూడా ఒకసారి ఈ వీడియో చూసి ఎలా అనిపించిందో మాతో షేర్ చేసుకోండి మరీ!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి