Shocking Video: సోషల్ మీడియాలో తరచూ ఏదో ఒక వీడియో వైరల్ గా మారుతుంటుంది. వాటిలో ఎక్కువగా సీసీటీవీ ఫుటేజీకి సంబంధించిన వీడియోలు అధికంగా ఉంటాయి. వాటిని చూసిన తర్వాత ప్రజలు ఆశ్చర్యానికి గురవుతుంటారు. ఇప్పుడు అలాంటి ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ వీడియోను చూసిన వారంతా షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఆ వీడియోలో ఆగి ఉన్న ఓ మోటర్ రిక్షా సడన్ గా స్టార్ట్ అవ్వడమే కాకుండా దాని ఇష్టం వచ్చినట్లు అటు, ఇటు తిరుగుతుంది. దాన్ని చూసిన స్థానికులు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో మీరే చూసేయండి. 


వీడియోలో ఏముందంటే?


వైరల్ గా మారిన వీడియో ప్రకారం.. రోడ్డు పక్కటన ఆగిన ఉన్న ఓ మోటార్ రిక్షా అకస్మాతుగా దానంతట అదే కదలడం మొదలైంది. ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే దాన్ని నడిపే డ్రైవర్ ఎవరూ లేకుండా అది కదులుతుంది. అయితే అప్పుడే అటుగా వెళ్తోన్న ఓ వ్యక్తి దాన్ని చూసి షాక్ అయ్యాడు. తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. ఆ రిక్షా నిలిపిన చుట్టుపక్కల ప్రదేశంలో రెండు కార్లను నిలిపారు. వాటి మధ్య నుంచి వేగంగా వెళ్తూ.. వాటిలో ఒకదాన్ని ఢీకొని అక్కడికక్కడే అగిపోయింది. 



అయితే ఆ రిక్షాను వీడియోలో ఉన్న వ్యక్తి అదుపు చేసేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రిక్షాకు దెయ్యం పట్టిందా? లేదా పెట్రోలు బదులు దానిలో మద్యం నింపారా? అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.  


Also Read: Leopard Hunting Video: కసిగా వేటాడిన చిరుతపులి.. వెంటనే పట్టుబడిన మొసలి.. వీడియో వైరల్!


Also Read: Thirsty Snake: చేతులతో పాము దాహం తీర్చిన వ్యక్తి - వీడియో వైరల్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook