September New Rules: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న కొత్త నిబంధనలు ఏంటో తెలుసా
September New Rules: నిత్య జీవితంలో సంబంధమున్న చాలా అంశాలు మారిపోతున్నాయి. కొత్త నిబంధనలు వచ్చి చేరాయి. కొత్త మార్పులు చోటుచేసుకున్నాయి. ఇవన్నీ రేపట్నించి మారనున్న నేపధ్యంలో ఆ వివరాలేంటో తెలుసుకుందాం.
September New Rules: నిత్య జీవితంలో సంబంధమున్న చాలా అంశాలు మారిపోతున్నాయి. కొత్త నిబంధనలు వచ్చి చేరాయి. కొత్త మార్పులు చోటుచేసుకున్నాయి. ఇవన్నీ రేపట్నించి మారనున్న నేపధ్యంలో ఆ వివరాలేంటో తెలుసుకుందాం.
సెప్టెంబర్ 1 అంటే రేపటి నుంచి కొత్త మార్పులు, కొత్త నిబంధనలు(September New Rules)వస్తున్నాయి. అది మీ పీఎఫ్ ఎక్కౌంట్ కావచ్చు, గ్యాస్ సిలెండర్ కావచ్చు, పాన్ నెంబర్, ఆధార్ లింక్ కావచ్చు..జీఎస్టీ నిబంధనలు కావచ్చు. ఆఖరికి గూగుల్ యాప్ పర్మిషన్ కావచ్చు. అన్నీ మారుతున్నాయి. ఏయే అంశాల్లో ఏం మారుతున్నాయి, వాటి వివరాలేంటో ఓసారి పరిశీలిద్దాం. సెప్టెంబర్ 1 నుంచి అమల్లో రానున్న కొత్త నిబంధనలేంటి, అవి ఎలా ప్రభావిం చేయనున్నాయి.
ఈపీఎఫ్ ఎక్కౌంట్‌కు(EPF Account) సంబంధించిన కొత్త నిబంధనలు సెప్టెంబర్ 1 నుంచి అమల్లో రానుంది. సెప్టెంబర్ 1 లోగా మీ పీఎఫ్ ఎక్కౌంట్‌ను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాల్సి ఉంటుంది. లేకపోతే మీకు అందించే ఈపీఎఫ్ ప్రయోజనాలు తగ్గిపోవచ్చు. ఉద్యోగుల ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్..ఆధార్ కార్డును పీఎఫ్‌తో(Aadhaar-Pf Account Link)లింక్ చేయాలని గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. లేకపోతే సమస్యలెదురవుతాయి. ఇక రెండో విషయం ఆధార్-పాన్‌కార్డ్(Aadhaar-pancard link) అనుసంధానం. ఇప్పటి వరకూ చేయకపోతే వెంటనే చేయండి. లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. వేయి రూపాయల జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది. పాన్ - ఆధార్ లింక్ గడువు సెప్టెంబర్ 30 వరకే ఉంది. ఇక మూడవది ప్రతి నెలా పెరుగుతున్నట్టే ఎల్‌పీజీ సిలెండర్ ధరలు సెప్టెంబర్ 1 నుంచి మారనున్నాయి. జీఎస్‌టీఆర్ - 3బి రిటర్న్స్ ఫైల్ చేయని ట్యాక్స్ పేయర్స్ జీఎస్‌టీ ఆర్ -1 రిటర్న్స్ ఫైల్ చేయకుండా ఆంక్షలు విధించే కొత్త రూల్ నెంబర్ 59 సెప్టెంబర్ 1 నుంచి అమల్లో రానుంది. అంటే వ్యాపారులు ప్రతి నెల జీఎస్ టీఆర్ -3బి ను ప్రతి నెల 20-24 మధ్యలో పైల్ చేయాల్సి ఉంటుంది. తరువాత జీఎస్‌టీఆర్ -1లో పైల్ చేయాలి.
మరో మూడు మార్పులు కూడా ఉన్నాయి. చెక్స్ క్లియరెన్స్‌కు(Cheque rules) సంబంధించి కొత్త నిబంధనలున్నాయి. దీనికోసం పాజిటివ్ పే సిస్టమ్‌ను ఆర్బీఐ (RBI)అందుబాటులో తెచ్చింది. ఈ పద్థతి సెప్టెంబర్ 1 నుంచి అమల్లో రానుంది. భారీ మొత్తంలో చెక్స్ ఇచ్చే ముందు కస్టమర్లు సంబంధిత బ్యాంకులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది చెక్ మోసాల్ని అరికట్టేందుకు పాజిటివ్ పే సిస్టమ్ అమల్లో తీసుకొచ్చింది ఆర్బీఐ. అటు స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేసేవారికి పీక్ మార్జిన్ నార్మ్స్ అమలు చేయనుంది సెబీ. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నాలుగవ దశ నిబంధనలు సెప్టెంబర్ 1 నుంచి అమల్లో రానున్నాయి. ఇక మరో మార్పు గూగుల్ యాప్స్(Google Apps) గురించి. గూగుల్ యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే కొత్త అనుమతులు ఉంటాయి.
Also read: Viral Photo: ఈ ఫోటోలో సింహం ఉంది...ఈజీగా గుర్తించవచ్చు..ఎక్కడుందో కనిపెట్టండి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook