Snake Eats Snake: ఎర్ర తల పాము మరో పామును అ మాంతంమింగేసింది.. మరీ ఇంత ఫాస్ట్‌గానా! వీడియో చూస్తే మతిపోద్ది
Viral Video, Snake Swallows Another Snake. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ వీడియోలో ఓ పాము మరో పాముని అమాంతం మింగేసింది. ఇది చూసిన నెటిజన్లు ఒక్కసారిగా అవాక్కవుతున్నారు.
Red Headed Snake Swallows Another Snake: పాముకు ఆకలేస్తే... ఏ కప్పనో, ఎలుకనో లేదా గుడ్లో తినడం మనం అప్పుడపుడు చూస్తూనే ఉంటాం. పాముకు బాగా ఆకలిస్తే ఏమీ దొరకని సమయంలో.. తన పిల్లలనే చంపి తింటుంది. అయితే ఓ పాము మరో పాముని తినడం ఎప్పుడైనా చూశారా?. ఇలాంటి వీడియోనే ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ పాము మరో పాముని అమాంతం మింగేసింది. దీనికి సంబంధించిన వీడియోను వైల్డ్ యానిమల్ పిక్స్ తన ట్విటర్‌లో షేర్ చేసింది.
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం... ఓ ఎర్ర తల ఉన్న పాము చెట్టు పొదల్లో దాగి ఉంటుంది. చుట్టూ ఆకులు, చెట్లు ఉంటాయి. వాటి మధ్యన ఎర్ర తల ఉన్న పాము కాచుకుని ఉంటుంది. బాగా ఆకలితో ఉందో ఏమో తెలియదు కానీ.. తమ జాతికే చెందిన ఓ పాము రాగానే ఒక్కసారిగా దాని తలను మింగేస్తుంది. చూస్తుండగానే ఆ పామును మొత్తం తినేస్తుంది.
ఇందుకు సంబంధించిన వీడియోను 'వైల్డ్ యానిమల్ పిక్స్' అనే ట్విటర్ పేజీ పోస్ట్ చేసింది. ఈ వీడియో రెండు వారాల క్రితం పోస్ట్ చేయబడింది. ఈ వీడియోకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. ఇప్పటికే ఒక లక్ష్య 30 వేల లైకులు వచ్చాయి. మరోవైపు 1000కి పైగా కామెంట్స్ వచ్చాయి. 'మరీ ఇంత ఫాస్ట్‌గానా' అని ఒకరు కామెంట్ చేయగా.. 'ఇది నిజమేనా' అని ఇంకొకరు ట్వీట్ చేశారు.
Also Read: టీమిండియాకు అన్నీ అపశకునాలే.. టీ20 ప్రపంచకప్ నుంచి మరో స్టార్ పేసర్ ఔట్!
Also Read: హర్భజన్ బౌలింగ్ యాక్షన్‌ను అచ్చు దించేసిన కోహ్లీ.. పడిపడి నవ్వుకున్న భజ్జీ, ఇర్ఫాన్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook