Snake Swallows Itself Video Goes Viral: పాములంటేనే చాలా మంది భయంతో పారిపోతుంటారు. పొరపాటున పాములు ఎక్కడైన కన్పిస్తే,ఆ ప్రదేశం దరిదాపుల్లోకి కూడా వెళ్లడానికి అస్సలు సాహాసం చేయరు. అడవులు,చెట్లు, చెరువులు, దట్టమైన ఆకులు, చీకటి ప్రదేశాలలో పాములు ఎక్కువగా కన్పిస్తాయి. పొలాలల్లో ఎలుకలను తినడానికి కూడా పాములు వస్తుంటాయి. అవి ఎలుకల వేటలో మన ఇళ్లలోకి కూడా కొన్నిసార్లు వస్తుంటాయి. పాములు కన్పిస్తే, కొందరు స్నేక్ సొసైటీవారికి సమాచారం ఇస్తారు. మరికొందరు ఎక్కడ తమకు అపకారం చేస్తుందో అని టెన్షన్ లో చంపేస్తుంటారు. పాములను భక్తితో కలిచే వాళ్లు కూడా ఉన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ముఖ్యంగా పాములు తమకు ఎక్కడ ఆపదకల్గుతుందో అని భావించి, కాటు వేస్తుంటాయి. పాములన్ని విషపూరీతమైనవికాదు. కానీ కొన్నిపాములు కాటేస్తే మాత్రం సెకన్ లలో ప్రాణాలు పొవాల్సిందే. కొన్నిపాములు, చిన్న పాములను ఆహారంగా తింటుంటాయి. తమ గుడ్లను తామే తినే పాములు కూడా ఉన్నాయి. పాములు ఎలాంటి వాతావరణ పరిస్థితులలోనైన ఈజీగా మనుగడ సాగిస్తాయి. కొన్నిసార్లు పాములు వింతగా ప్రవర్తిస్తాయి. తమమీద తామే కాటు వేసుకుంటాయి. ఈ కోవకు చెందిన పాము వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


పాములు ముఖ్యంగా కొన్నిసార్లు ఊహించని విధంగా ప్రవర్తిస్తాయి. ప్రస్తుతం వైరల్ గా మారుతున్న ఒక వీడియోలో పాము తనతోకను తానే మింగేస్తుంది. చుట్టుపక్కల ఉన్న వారు కూడా ఆశ్చర్యంతో చూస్తున్నారు. అంతేకాకుండా.. పామును వేరుచేయడానికి ప్రయత్నించాడు. అతను తనచేతిలో సానిటైజర్ లిక్విడ్ వేసుకుని పాము ముఖం వద్ద అప్లై చేశాడు.


Read More: Janasena Pawan Kalyan: పిఠాపురంలో పవన్ కల్యాణ్ కు బకెట్ గుర్తు దెబ్బ.. 


దీంతో పాము వెంటనే ఆ స్మెల్ ను భరించలేక, తన మింగుతున్న తోకను వదిలేసి వెనక్కు జరిగిపోయింది. ముఖ్యంగా పాములకు సానిటైజర్ స్మెల్ అంటే అస్సలు పడదంట. దీంతో పాము అక్కడి నుంచి వెంటన తన తోకను వదిలేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. దీన్ని చూసిన నెటిజన్లు వామ్మోఇదేం రా నాయన అంటూ కామెంట్లు పెడుతున్నారు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


 


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook