రైల్లో తలకిందులుగా వేళ్లాడుతూ కనిపించిన స్పైడర్ మేన్
ఇంటర్నెట్ నిండా ఎన్నో విచిత్రమైన ఘటనలు, అబ్బూరపరిచే దృశ్యాలే.
ఇంటర్నెట్ నిండా ఎన్నో విచిత్రమైన ఘటనలు, అబ్బూరపరిచే దృశ్యాలే. ముఖ్యంగా ట్విటర్ మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తకుండా ఒక్క రోజు కూడా గడవదు. చిత్రవిచిత్రమైన ట్వీట్ ఏదైనా పోస్ట్ అయ్యిందంటే, పోస్ట్ అయిన కొద్ది నిమిషాల్లోనే అది వైరల్‌గా మారి ఇంటర్నెట్‌ని షేక్ చేయడం తరచుగా చూస్తూనే వున్నాం. తాజాగా అటువంటి వీడియో ఒకటి ట్విటర్‌లో ప్రత్యక్షమైంది. ప్రస్తుతం ట్విటర్‌లో వైరల్‌గా మారిన ఈ వీడియోలో స్పైడర్ మేన్ (సినిమా క్యారెక్టర్ కాదు) ఓ ట్రెయిన్‌లో తలకిందులుగా వేళ్లాడుతూ తన మొబైల్‌ని బ్రౌజ్ చేస్తుండటం చూడవచ్చు. బోస్టన్‌లో ఈ దృశ్యం చోటుచేసుకున్నట్టుగా ఆశ్లే ఆర్మ్‌స్ట్రాంగ్ అనే మహిళ ఈ వీడియోనూ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ఆశ్లే ఆర్మ్‌స్ట్రాంగ్ ఆ వీడియోను అలా పోస్ట్ చేసిందో వెంటనే ట్వీట్ కింద కామెంట్స్ మీద కామెంట్స్ వచ్చిపడ్డాయి.
ఈ వీడియో పోస్ట్ అయిన కొన్ని నిమిషాల్లోనే దాదాపు వెయ్యికిపైగా మంది నెటిజెన్స్ ఈ ట్వీట్‌ని రిట్వీట్ చేశారు. వేల మంది లైక్ చేశారు. లక్షకుపైగా మంది ఈ వీడియోను చూశారు. సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేసేయండి.